మగాళ్లకు కూడా లైంగిక వేధింపులు.. సంచలన విషయాన్ని బయటపెట్టిన స్టార్ యాక్టర్
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన వార్తలు మరోసారి వైరల్ గా మారాయి. అసలైతే గత ఏడాది బయటపడ్డ కొంత మంది స్టార్స్ లీక్స్ ద్వారా సంచలనం సృష్టించిన మీటూ ఉద్యమం ఎక్కడికి వెళుతుందో అని అందరూ అనుకున్నారు. కానీ గొడవ ఎక్కువ రోజులు కొనసాగలేదు. ఇక ముగిసింది అనుకున్న తరుణంలో మరోసారి కొంత మంది స్టార్స్ మళ్ళీ ఆ పదాన్ని గుర్తు చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు ప్రతి చిన్న ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ భూతం నటీమణులను పట్టి పీడిస్తోంది.

ఎంత మంది చెప్పినా..
మీటూ ఉద్యమానికి స్టార్ హీరోయిన్స్ కంటే చిన్న తరహా నటీమణులే ఎక్కువగా మద్దతు పలికారు. సినీ ప్రముఖుల బాగోతలను బయటపెడుతూ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. అయితే ఎంతమంది చెప్పినా ఈ మీటూ ఉద్యమానికి పెద్దగా న్యాయం జరిగింది లేదు. మళ్ళీ అదే తరహాలో కొత్త వివాదాలు తెరపైకి వస్తున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు వారి మాటలకు విలువ లేకుండా పోతోంది.

మగాళ్లకు కూడా..
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటే హీరోయిన్స్ కి ఆఫర్లతో ఎరవేసి కమిట్మెంట్ అడుగుతుంటారని అందరికి తెలిసిన విషయం. అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ ఉచ్చులో అప్పుడప్పుడు కొంతమంది మగాళ్లకు కూడా ఇబ్బందులు తప్పలేవని వారికి కూడా లైంగిక వేధింపులు ఎదురైనట్లు తెలుస్తోంది. ఆడవాళ్లే కాకుండా మగాళ్లు కుడా కొన్నిసార్లు లొంగిపోవాల్సి వస్తుందని గతంలోనే కొంత మంది నటీమణులు కూడా సంచలన కామెంట్స్ చేశారు.

ఆ దర్శకుడు గదిలోకి రమ్మన్నాడు..
హిందీ యాక్టర్ రాజీవ్ ఖండేల్వాల్ ఇటీవల చేసిన కామెంట్స్ అందరిని షాక్ కి గురి చేశాయి. బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రాజీవ్ కూడా లైంగిక వేధింపులకు గురయ్యాడట. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెబుతూ.. ఒక ప్రముఖ దర్శకుడు హీరోగా ఛాన్స్ ఇస్తానని అన్నాడు. తనను గదిలోకి రమ్మని లైంగికంగా వేదించినట్లు వివరణ ఇచ్చిన రాజీవ్ తన చేష్టలను అర్థం చేసుకొని తిరస్కరించానని అన్నాడు.
Recommended Video

అప్పుడు హీరో అయ్యేవాన్ని..
రాజీవ్ ఖండేల్వాల్ అంటే హిందీ టెలివిజన్ ఆడియెన్స్ లో మరచిపోలేని విధంగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ యాక్టర్ కెరీర్ మొదట్లో హీరోగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశాడు. కానీ అవకాశాలు దొరకలేదు. ఒక సినిమాలో అవకాశం దొరికింది అనే సమయానికి ఆ చిత్ర దర్శకుడు లైంగికంగా వేదించడంతో తప్పుకున్నాడు. ఒకవేళ ఆ సినిమా తాను చేసి ఉంటే హీరోగా సక్సెస్ అయ్యి ఉండేవాడినని రాజీవ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











