Holi Celebrations: రంగుల్లో మునిగి తేలిన బాలీవుడ్.. రొమాంటిక్‌గా భర్తతో ప్రియాంక (Photos)
దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. బాలీవుడ్ ప్రముఖులు ఎంజాయ్ చేసినంతగా ఈ పండగను మరోకరు చేసినట్టు కనిపించడం లేదు. పలువురు స్టార్ సెలబ్రిటీలు రంగుల్లో మునిగి తేలారు. ఆకాశాన్ని అంటిన ఆనందంతో రంగునీళ్లతో జోష్ పెంచారు. బాలీవుడ్‌లో హోలీ ఆడిన తారల ఫోటోలు మీకోసం..

ప్రియాంక చోప్రా జోష్‌గా
బాలీవుడ్, హాలీవుడ్ తార ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్‌తో కలిసి హోలీని క్రేజీగా జరుపుకొన్నది. పుణేలో జరుపుకొన్న హోలీ సెలబ్రేషన్ ఫొటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. గత కొద్దిరోజులుగా రంగుల జీవితంలో మునిగి తేలుతున్నాం. ఇంటిపట్టునే నిక్ ఉండటంతో నిక్‌తో తొలిసారి హోలీ పండుగను చేసుకొన్నాను అని ప్రియాంక చోప్రా ఇన్స్‌టాలో పేర్కొన్నది.

తైమూరుతో కరీనా కపూర్
శ్వేత వర్ణ దుస్తుల్లో కరీనాకపూర్ తన కుమారుడు తైమూర్‌తో కలిసి జరుపుకొన్నది. అయితే కలర్లు అంటిన ఫోటోలను మాత్రం కరీనా షేర్ చేయకుండా జాగ్రత్త పడింది.

అమితాబ్ ఫ్యామిలీతో పండగ
ఎప్పటి మాదిరిగానే అమితాబ్ బచ్చన్ నివాసంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. జయబచ్చన్, శ్వేతా బచ్చన్ నందా, ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ హోలీని జోష్‌తో సెలబ్రేట్ చేసుకొన్నారు.

అమీర్ ఖాన్ నివాసంలో
మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నివాసంలో కూడా హోలీ వేడుకలు బ్రహ్మండంగా జరిగాయి. కిరణ్ రావు తన కుమారుడితో కలిసి రంగులు పూసుకొని పర్వదినాన్ని మధురంగా మార్చుకొన్నారు.

దీపికా పదుకోన్
అందాల భామ దీపికా పదుకోన్ మాత్రం హోలీ పండుగకు దూరంగా ఉన్నట్టు కనిపించింది. కాకపోతే ఇన్స్‌టాగ్రామ్‌లో తన చిత్రంలోని ఓ హోలీ పాటను షేర్ చేసి అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపింది.


Click it and Unblock the Notifications











