సుశాంత్ మృతిపై పెదవి విప్పిన తండ్రి, సోదరి.. షాకింగ్‌గా హోం మంత్రి ట్వీట్.. 9 మందిని పోలీసులు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. యువ హీరోకు సూసైడ్ వెనుక కారణాలు ఏమై ఉంటాయనే విషయంపై పలు కోణాల్లో విచారణ ప్రారంభించారు. తమ దర్యాప్తులో భాగంగా కుటుంబ సభ్యులను, సన్నిహితులను, స్నేహితులను, టీమ్ మెంబర్స్‌ను విచారించారు. తాజాగా సుశాంత్ గురించి కుటుంబ సభ్యులు ఎమోషనల్ విషయాలను బయటపెట్టారు. తండ్రి ఏం చెప్పారంటే..

మనసులో తెలియని బాధ కనిపించేది
సోమవారం అంత్యక్రియల తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్‌ను ముంబై పోలీసులు కలిసి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కేకే సింగ్ పలు విషయాలను చెబుతూ.. కొద్ది రోజులుగా సుశాంత్ మనస్తాపానికి గురైనట్టు కనిపించారు. మనసులో ఏదో తెలియని బాధ, బెంగ పెట్టుకొన్నట్టు కనిపించారు. కానీ తన గుండెలో అంత బాధ ఉంటారనే విషయాన్ని గ్రహించలేకపోయాం అని ఎమోషనల్ అయ్యారు.

డిప్రెషన్ గురించి తెలియదు
సుశాంత్ సింగ్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు మాకు తెలియదు. డిప్రెషన్‌కు చికిత్స జరుగుతున్నట్టు గానీ మందులు వాడుతున్నట్టు గానీ చెప్పలేదు. ఒకవేళ ఈ విషయం తెలిసి ఉంటే ఇంత వరకు వచ్చి ఉండేది కాదు. మేము జాగ్రత్త తీసుకొని సుశాంత్‌ను కాపాడుకోనే వారం అని కేకే సింగ్ చెప్పినట్టు సమాచారం.

ఎవరిపై అనుమానం లేదు
ఈ క్రమంలో సుశాంత్ సింగ్ సిస్టర్స్ ఇద్దరిని కూడా ముంబై పోలీసులు ప్రశ్నించారు. మరణానికి ముందు సుశాంత్ మానసిక పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని ఆరా తీశారు. ఈ సందర్భంగా మా సోదరుడు డిప్రెషన్‌కు గురైనట్టు కనిపించలేదు. అలాగే తనను ఎవరైనా వేధించారనే విషయం గురించి చెప్పలేదు. మాకు ఎవరిపై అనుమానం లేదు అని చెప్పినట్టు తెలిసింది.

తొమ్మిది మందిని విచారించిన పోలీసులు
ఇప్పటి వరకు సుశాంత్ సింగ్ మరణం తర్వాత మొత్తం తొమ్మిది మందిని విచారించారు. ప్రొఫెషనల్ విభేదాల గురించి తెలుసుకొనేందుకు మరోసారి సుశాంత్ స్నేహితుడు మధు శెట్టిని ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఒకసారి విచారించిన పోలీసులు.. మరింత సమాధానం రాబట్టేందుకు మధు శెట్టిని విచారణకు రమ్మని చెప్పినట్టు తెలిసింది.

క్రియేటివ్ మేనేజర్‌ను ప్రశ్నించేందుకు..
సుశాంత్ సింగ్ మరణం కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు ఉన్నతాధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జరిగిన విచారణలో బలమైన కారణాలు గానీ, అనుమానాస్పద విషయాలు బయటకు రాలేదు. యువ హీరో ఆర్థిక లావాదేవీలు, వ్యాపార వ్యవహారాలు, కెరీర్ గురించిన విషయాలపై ఆరా తీసేందుకు క్రియేటివ్ మేనేజర్ సిద్ధార్థ్ పితానిని విచారించనున్నామని చెప్పారు.
Recommended Video

హోం మంత్రి ట్వీట్
సుశాంత్ సూసైడ్ వెనుక కారణాలపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ కుమార్ స్పందించారు. సుశాంత్‌ది ఆత్మహత్య అనే విషయం పోస్టు మార్టంలో వెల్లడైంది. సినీ పరిశ్రమలో కొందరి వేధింపులతో డిప్రెషన్‌కు లోనయ్యారనే ఆరోపణలపై దృష్టి పెట్టాం. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం అని హోం మంత్రి తెలిపారు.


Click it and Unblock the Notifications











