కళ్లతో రేప్ చేసాడంటూ హీరోయిన్ ఆరోపణలు... అసలు నిజం ఏమిటి?

'కళ్లతో నన్ను రేప్ చేశాడు' అంటూ బాలీవుడ్ నటి ఇషా గుప్తా ఇటీవల ఢిల్లీకి చెందిన హోటల్ నిర్వాహకుడు రోహిత్ విగ్ మీద సంచలన ఆరోపణలు చేయడం మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇద్దరు సెక్యూరిటీ గార్డుల రక్షణలో ఉన్న తనలాంటి సెలబ్రిటీకి ఈ దేశంలో ఇలాంటి పరిస్థితి ఎదురైంతే... సామాన్య మహిళల పరిస్థితి ఏమిటీ అంటూ ఇషా గుప్తా ప్రశ్నించారు.

రోహిత్ విగ్ ఫోటో తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసిన ఈ బాలీవుడ్ నటి వరుస ట్వీట్లతో అతడిపై విరుచుకుపడ్డారు. ఈ ట్వీట్స్ ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేసింది. కళ్లతో కూడా రేప్ చేయవచ్చా? అంటూ కొందరు వ్యంగ్యమైన కామెంట్లు చేయగా, రోహిత్ విగ్ తప్పుడు బుద్దిని అతడి చూపుల్లో ఇషా కనిపెట్టి తగిన బుద్ది చెప్పిందంటూ మరికొందరు ప్రశంసించడం మొదలు పెట్టారు.

ఇలా కూడా రేప్ జరుగుతుందా?

ఇలా కూడా రేప్ జరుగుతుందా?

అయితే ఇషా గుప్తా బాలీవుడ్ కొలీగ్ సుభాష్ కె ఝా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘రోహిత్ విగ్ అనే వ్యక్తి తనను కళ్లతోనే రేప్ చేశాడని ఆమె ఎలా ఆరోపిస్తుందో అర్థం కావడం లేదు. కళ్లతో రేప్ చేయడం అనేది నేనెప్పుడూ వినలేదు, చూడలేదు'' అంటూ విస్మయం వ్యక్తం చేశారు.

అలా చేయడం ఈ ప్రపంచంలో ఎక్కడా నేరం కాదు

అలా చేయడం ఈ ప్రపంచంలో ఎక్కడా నేరం కాదు

‘రోహిత్ అదే పనిగా ఆమె వైపు తేరిపారి చూశాడని స్పష్టమవుతోంది. అలా చేయడం ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా నేరం కాదు. అతడు అలా చేయడం వల్ల ఆమె ఇబ్బంది పడ్డట్లు ఫీలైంతే హోటల్ మేనేజ్మెంటుకు కంప్లయింట్ చేయకుండా ఎందుకు అక్కడి నుంచి వెళ్లి పోయారు.' అని ప్రశ్నించారు.

సినిమా పబ్లిసిటీ కోసమా?

సినిమా పబ్లిసిటీ కోసమా?

ఇషా గుప్తా తీరు చూస్తుంటే తన కొత్త సినిమా రిలీజ్ సందర్భంగా కావాలనే ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేసి తమాషా చేస్తున్నట్లు ఉంది. కళ్లతో రేప్ చేయడం అనే మాట ఇప్పుడే వింటున్నాను. ఇది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు అని సుభాష్ కె ఝా అభిప్రాయ పడ్డారు.

ఇషా గుప్తా తీరుపై అనుమానాలు

ఇషా గుప్తా తీరుపై అనుమానాలు

ఇషా గుప్తా ఆరోపణలపై సుభాష్ కె ఝా లేవనెత్తిన ప్రశ్నలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఆయన చెప్పినట్లు ఇది తన కొత్త సినిమా పబ్లిసిటీ కోసం అయి ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇషా నటించిన ‘వన్ డే: జస్టిస్ డెలివర్డ్' అనే చిత్రం జులై 5న విడుదలైంది. ఇందులో క్రైంబ్రాంచ్ ఆఫీసర్ లక్ష్మి రాఠి పాత్రలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X