మాఫియా డాన్ గిఫ్ట్ ఇచ్చిన హీరోయిన్ ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
బాలీవుడ్ అగ్ర హీరోయిన్ జాక్వలైన్ ఫెర్నాండేజ్ నివాసంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ ఆ ప్రాంతంలో కలకలం రేపింది. సైఫ్ ఆలీ ఖాన్, కరీనా కపూర్, రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, రణ్‌వీర్, దీపిక పదుకోన్ నివాసాల సముదాయాలకు దగ్గర్లో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులంతా దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ వివరాల్లోకి వెళితే..
గతంలో జాక్వలైన్ ఫెర్నాండేజ్ 200 కోట్ల రూపాయల వ్యయంతో సముద్రానికి ఎదురుగా ఉండే విలాసవంతమైన 5 బెడ్ రూమ్స్ ఫ్లాట్‌ను పాలి హిల్స్‌లో కొనుగోలు చేసిందనే వార్తలు రావడంతో అందరు షాక్ అయ్యారు. పెద్దగా సినిమాలు లేని హీరోయిన్ ఇంత పెద్ద మొత్తంతో ఎలా ఇంటిని కొనుగోలు చేసిందని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపించాయి.

అయితే కొద్ది రోజులకు మాఫియా డాన్, ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వలైన్ ఫెర్నాండేజ్ అక్రమ బంధం బయటకు రావడం సంచలనం రేపింది. పారిశ్రామికవేత్తలను బెదిరించి సంపాదించిన డబ్బుతోనే జాక్వలైన్ ఇంటిని కొనుగోలు చేసిందనే వార్తలు గుప్పుమన్నాయి. ఆ తర్వాత జాక్వలైన్ బ్యాంక్ ఖాతాలు, ఇతర వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) దృష్టిపెట్టింది. పలుమార్లు ఈడీ ఆమెను కూడా విచారించిన విషయం తెలిసిందే.
అలాంటి వివాదాస్పదంగా మారిన ఇంటిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నర్గీస్ దత్ రోడ్డులో ఉన్న ఈ భవనంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకొన్నది. కిచెన్‌లో మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించిందని తెలిపారు. నావరోజ్ హిల్ సొసైటీలోని 14వ అంతస్తులో ప్రమాదం జరిగిందని తెలియగానే సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జాక్వలైన్ నివసించే ఇంటిలో పొగలు వ్యాపించడంతో అందులో నివసిస్తున్న వారు పరుగులు పెట్టారు. సకాలంలో అగ్నిమాపక దళం అక్కడికి వచ్చి మంటలను ఆర్పడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టం ఏమీ జరగలేదని ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. దాంతో ఆ భవన నివాసితులు ఊపిరి పీల్చుకొన్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
జాక్వలైన్ ఫెర్నాండేజ్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల విక్రాంత్ రోనా, రామ్ సేతు, సర్కస్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలు ఆమెకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. గతేడాది సెల్ఫీ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె నటించిన ఫతే అనే సినిమాలో నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











