విరాట్ కోహ్లీ ఒక్క లైక్‌తో.. అవనీత్ కౌర్‌కు ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?
కొందరు ఔత్సాహిక తారలు జీవితాంతం కష్టపడినా.. తమ ప్రతిభను ఎంత బయటపెట్టుకొన్నా పాపులారిటీ సాధించడం చాలా కష్టమైపోతుంది. ఇండస్ట్రీలో గుర్తింపు పొందడానికి నానా రకాల అగచాట్లు పడాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం ఇలా వచ్చి ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీ అయిపోతుంటారు. వారి చుట్టే మీడియా చక్కర్లు కొడుతుంది. అలా ఓవర్‌నైట్‌లో సెలబ్రిటీగా మారిన అవనీత్ కౌర్ తంతే నేతి గారెల బుట్టలో పడిందనే చందనంగా మారింది. అవనీత్ కౌర్ ఆస్తుల గణనీయంగా పెరిగిన తీరు? ఆమె పాపులారిటీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
అవనీత్ కౌర్ కెరీర్ విషయానికి వస్తే.. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ అనే రియాల్టీ షో ద్వారా 2010 వినోద పరిశ్రమలోకి ప్రవేశించింది. సెమిఫైనల్ స్థాయిలోనే ఎలిమినేట్ అయిన ఆమె.. ఆ తర్వాత డ్యాన్స్ కే సూపర్ స్టార్స్, ఝలక్ దిక్లా జా లాంటి డ్యాన్స్ షోలో పాల్గొన్నారు. అయితే నటిగా మాత్రం మేరి మా అనే సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టారు. ఇలా టెలివిజన్ రియాలిటీ షోలతో బిజీగా మారిపోయారు.

ప్రముఖ నటి రాణి ముఖర్జీ నటించిన మర్దానీ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్ారు. ఆ తర్వాత మర్దానీ 2, టికూ వెడ్స్ షేరూ, లవ్ కీ అరెంజ్ మ్యారేజ్ సినిమిాల్లో నటించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. ప్రస్తుతం నటించిన మిషన్ ఇంపాజిబుల్: ది ఫైనల్ రెకానింగ్, లవ్ ఇన్ వియత్నాం సినిమాలపైనే గంపెడు ఆశలు పెట్టుకొన్నది.
అయితే టెలివిజన్, బాలీవుడ్‌లో అంతగా పాపులారిటీ రాకపోవడంతో సోషల్ మీడియానే ఆమె నమ్ముకొన్నది. హాట్ హాట్ ఫోటోషూట్లతో ఆమె సందడి చేసింది. ఆమె పోస్టు చేసే హాట్ ఫోటోలు ఫ్యాన్స్ పిచ్చెక్కించేలా చేశాయి. అలాంటి హాట్ ఫోటోలను చూసి ఇండియన్ టాప్ క్రికెటర్ కూడా ఆమె ట్రాప్‌లో పడ్డాడు. అనుకోకుండా ఆమె హాట్ ఫోటోను లైక్ చేసి వివాదంలో ఇరుక్కొన్నారు.
అవనీత్ కౌర్ శృంగార భరితంగా ఉండే ఫోటోను విరాట్ కోహ్లీ లైక్ చేయడం చాలా గందరగోళానికి గురి చేసింది. మీడియాలో ఆ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. దాంతో అవనీత్ కౌర్ పేరు ఎత్తకుండా నా విషయంలో జరుగుతున్న వివాదంపై నేను క్లారిటీ ఇవ్వాలనుకొంటున్నానని విరాట్ కోహ్లీ స్పందించాడు. అల్గారిథమ్ కారణంగా తప్పుగా లైక్ కొట్టడం జరిగి ఉంటుంది. దాని వెనుక ఎలాంటి మరో ఉద్దేశం లేదు. దానిపై ఏవో ఊహగానాలు ఆపాదించుకోవద్దు. ఈ విషయాన్ని సరిగా అర్ధం చేసుకొన్న వారికి నా థ్యాంక్స్. అంతకు మించి నేను ఏమీ చెప్పడానికి ఏమీ లేదు అంటూ ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లీ లైక్ కొట్టిన తర్వాత అవనీత్ కౌర్ పాపులారిటీ, డిమాండ్ ఊహించని విధంగా మారిపోయింది. కేవలం 48 గంటల్లో 1.2 మిలియన్ల మేర సబ్‌స్క్రైబర్స్ పెరిగిపోయారు. సోషల్ మీడియాలో ఆమె ఒక్క పోస్టు విలువ 30 శాతం పెరిగింది. ఒక్కో పోస్టుకు 2 లక్షలు తీసుకొంటుంటే.. విరాట్ లైక్ తర్వాత అది 2.6 లక్షలకు పెరిగింది అని డిజిటల్ మీడియా ఏజెన్సీ బజ్ క్రాఫ్ట్ వెల్లడించింది.
సోషల్ మీడియాలో యాక్సిడెంటల్ వైరల్ క్వీన్‌గా పాపులారిటీని సంపాధించిన అవనీత్ కౌర్‌కు 72 గంటల్లోనే 12 కొత్త ఎండార్స్‌మెంట్స్ వచ్చాయి. ఆమె ఆస్తుల విలువ గణనీయంగా పెరిగింది. కేవలం విరాట్ కోహ్లీ లైక్ కొట్టిన తర్వాత వచ్చిన ఆఫర్లు, ఎండార్స్‌మెంట్స్, సోషల్ మీడియాలో పెరిగిన పోస్టుల విలువతో సుమారుగా ఆమె ఆస్తి విలువ 41 కోట్ల రూపాయలు అని సోషల్ మీడియా స్ట్రాటెజిస్టులు పేర్కొన్నారని బిజినెస్ టుడే ఓ కథనంలో పేర్కొన్నది.


Click it and Unblock the Notifications











