సూపర్ స్టార్ మేనేజర్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా? సమంత, రష్మిక స్థాయిలో సంపాదన!
సినిమా పరిశ్రమలో ఏ హీరో అయినా, ఏ హీరోయిన్ అయినా సక్సెస్ అయిందంటే వారి టాలెంట్, అదృష్టం కొంత అయితే.. వారిని సక్రమ మార్గంలో నడిపించే మేనేజర్లదే కీలక పాత్ర అంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. హీరోలు తీసుకొనే నిర్ణయాలు, చేసే సినిమాల వెనుక వారి కృషి ఎంతైనా ఉంటుంది. అలా ఓ సూపర్ స్టార్ వెనుక బలమైన పిల్లర్‌గా ఉండి.. కష్టసుఖాల్లో అండగా నిలిచిన మేనేజర్ గురించిన విషయాల్లోకి వెళితే..
చిన్న స్థాయి నటుడిగా కెరీర్ మొదలు పెట్టి.. బాలీవుడ్ బాద్షాగా పేరు సంపాదించుకొన్న సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కెరీర్‌లో మొదటి నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న మేనేజర్ పూజా దద్దానీ. ముంబైకి చెందిన ఈ అందాల బొమ్మ.. 2012 సంవత్సరంలో షారుక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో చేరడం ద్వారా కెరీర్ ఆరంభించారు. ఆమె తన పనితీరుతో షారుక్‌కు అత్యంత సన్నిహితంగా మారారు.

రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌లో కీలకంగా మారిన పూజా ఆ తర్వాత ఓ మెట్టు ఎక్కి షారుక్ మేనేజర్‌గా మారారు. షారుక్ బ్లాక్ బస్టర్ సాధించిన సమయంలోను, అలాగే వరసు ఫ్లాపులతో నాలుగేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సమయంలోను ఆమె నైతికంగా ఆయన వెంట నడిచారు. అలాగే షారుక్ అంతర్గత విషయాల్లో కూడా సలహాలు ఇచ్చే కీలకమైన వ్యక్తిగా మారిపోయారు.
ఇక షారుక్ జీవితంలో అత్యంత వివాదాస్పదంగా మారిన తన కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కూడా పూజా నిర్వహించిన పాత్ర చాలా కీలకమని చెప్పుకొంటారు. ఆ కేసులో లాయర్లతో సంప్రదింపులు, మీడియాకు ఇచ్చే వివరాల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారు. ఆర్యన్ కేసులో పూజా వ్యవహరించిన తీరు మీడియాలో హైలెట్ అవ్వడం తెలిసిందే.

ఇలా షారుక్ ఖాన్ టీమ్‌లో అత్యంత కీలకంగా మారిన పూజా దద్దానీకి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు సమాచారం. ఆమె సేవలకు గాను ప్రతీ ఏటా 10 నుంచి 12 కోట్ల వరకు పారితోషికం ఇస్తున్నారని ప్రముఖ వెబ్ సైట్ వెల్లడించారు. అయితే బాలీవుడ్‌లోని హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఆమె జీతాన్ని అందుకొంటున్నారని సినీ వర్గాలు వెల్లడించారు.

ఇక పూజా దద్లానీ ఆస్తుల విలువ కూడా ఘనంగానే ఉంది. ఆమె ముంబై బాంద్రాలో విలాసవంతమైన ఇల్లు, అలాగే మెర్సిడెజ్ బెంజ్ కారు. భారీగా జ్యువెల్లరీ, ఇతర స్థిరాస్థులు కూడా ఉన్నాయని ఆర్థిక సంస్థలు వెల్లడించాయి. తాజా అంచనా ప్రకారం ఆమె ఆస్తుల విలువ సుమారుగా 50 నుంచి 55 కోట్ల మధ్య ఉంటుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











