షారుఖ్ ఖాన్ డూప్ సాలరీ ఎంతో తెలిస్తే... కళ్లు తేలేస్తారు
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, 2018లో జీరో తరువాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. ఆ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. కింగ్ ఖాన్ మళ్లీ తెరపై అలరించాలని, దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతడి అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో షారుఖ్ బాడీ డబుల్ ప్రశాంత్ వాల్డే పలు ఆసక్తిక అంశాలు అభిమానులతో పంచుకున్నాడు.
షారుఖ్ అందుబాటులో లేనప్పుడు అతడి బదులు డమ్మీగా నటిస్తూ, దర్శకనిర్మాతలకు చేదోడు వాదోడుగా జీవనం సాగిస్తున్న ప్రశాంత్, పలు చీటింగ్ షాట్లలో కింగ్ ఖాన్ పాత్రను సమర్థవంతంగా పోషించాడు. ఓం శాంతి ఓం సినిమా నాటి నుంచి.. కింగ్ ఖాన్ తో కలసి ప్రయాణం సాగిస్తున్న ప్రశాంత్ చెన్నై ఎక్స్ ప్రెస్, డాన్ 2, ఫ్యాన్, రబ్ నే బనాదీ జోడీ, రయీస్, డియర్ జిందగీ సినిమాల్లో బాడీ డబుల్ గా నటించాడు. అయితే, ఇందుకుగానూ ప్రశాంత్ కు భారీ పారితోషకమే ముడుతోందట.

నిజమే, షారుక్ డూప్ గా నటిస్తూ ప్రశాంత్.. రోజుకు 30వేల రూపాయిలు పారితోషకంగా పొందుతున్నాడట. దీంతో నోరెళ్లబెట్టడం జనాల వంతవుతోంది. ఏమైనా, రిస్క్ తో కూడుకున్న పని కాబట్టి ఆ మాత్రం భారీ పారితోషకం ముచ్చజెప్పడంలో తప్పేలేదు. ఇక పోతే 2018 తరువాత కింగ్ ఖాన్ సినిమాలకు కాస్త దూరంగా జరగడంపైనా ప్రశాంత్ స్పందించాడు. బాద్షా తప్పకుండా ఓ మాంచి సినిమాతో జనాల ముందుకు వస్తాడని తెలిపాడు.


Click it and Unblock the Notifications











