కితకితల పెట్టేస్తానంటోన్న క్రిష్... కామెడీని పండిచబోతున్న హృతిక్
యాక్షన్ హీరోగా అదరగొట్టేస్తున్న హృతిక్ రోషన్, ఇప్పటి వరకూ లవర్ బాయ్ గా, ఫ్యామిలీ హీరోగానూ కనిపించాడు. అయితే, క్రిష్ ఫ్రాంచైజ్ లు మొదలైనప్పటి నుంచీ యాక్షన్ బాటలోనే కొనసాగుతున్న ఈ గ్రీకువీరుడు క్రిష్ 4 ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాకన్నా ముందు ఓ కామెడీ ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతున్నాడట.
ఇటీవలే వార్ సినిమాలో సూపర్ కాప్ గా కనిపించి హంగామా చేసిన హృతిక్, ఈసారి రొటీన్ కు భిన్నంగా ఏదైనా ట్రై చేయాలని తోచిందట. ఇక కెరీర్ లో ఇప్పటివరకూ తాను కామెడీ జోనర్ ను టచ్ చేయకపోవడంతో ఆ దిశగానే అడుగువేసేందుకు సిద్ధమవుతున్నాడు. వరుస యాక్షన్ సినిమాల నుంచి తనకూ, ప్రేక్షకులకూ బ్రేక్ ను ఇచ్చేందుకే మనోడు హాస్య మంత్రాన్ని జపిస్తున్నాడని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాతో పాటూ మరో యాక్షన్ సినిమాను కూడా లైన్ అప్ చేసిన హృతిక్.. ఈ రెండింటినీ ఓ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కోసమే చేయనున్నాడని తెలుస్తోంది. మరోవైపు క్రిష్ 4 కోసం అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి.
హృతిక్ తండ్రి, రాకేశ్ రోషన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న క్రిష్ 4 ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలను పెంచేసింది. మరి కామెడీ సినిమాతో మేకోవర్ కోసం ట్రై చేస్తున్న హృతిక్, ప్రేక్షకులను ఏ రీతిన మెప్పిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











