కుర్రపిల్లతో స్టార్ హీరో రొమాంటిక్ వెకేషన్.. బికినీ భామతో జల్సా

సినీ రంగంలో ఇటీవలి కాలంలో వివాదాలు, విభేదాలతో పాటు విడాకులు, బ్రేకప్‌లు కూడా ఎక్కువయ్యాయి. ఎవరు ఎప్పుడు ఏ బాంబు పేలుస్తారో అని అభిమానులు, సినీ ప్రముఖులు టెన్షన్ పడ్డారు. ఇలాంటి పరిస్ధితులు మునుపెన్నడూ కనిపించలేదు. ఇక కొందరు నటీనటుల మధ్య ఏదో జరుగుతోందన్న పుకార్లు కూడా గతేడాది బాగా వినిపించాయి. తాజాగా ఈ లిస్ట్‌లో బాలీవుడ్ స్టైలీష్ హీరో హృతిక్ రోషన్ చేరారు.

బాలీవుడ్ దర్శక నిర్మాత రాకేష్ రోషన్ కుమారుడే హృతిక్ రోషన్. చిన్న వయసులోనే బాలనటుడిగా మెప్పించారు హృతిక్. 2000లో కహోనా ప్యార్ హై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన నాటి నుంచి నేటి వరకు తన నటనతో ఆకట్టుకుంటున్నారు. గ్రీకువీరుడిలాంటి ఫిజిక్‌, తేనేకళ్లతో చూడగానే ఆకట్టుకునే రూపం హృతిక్ రోషన్ సొంతం. అన్నింటికి మించి ఆయన డ్యాన్సింగ్ స్కిల్స్‌ అద్భుతం. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న నటుల్లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే ఖచ్చితంగా హృతిక్ పేరు ముందు వరుసలో ఉంటుంది.

Hrithik Rohan romantic Vacation with Saba Azad photos trending in Instagram

హృతిక్‌లో నటుడే కాదు.. నిర్మాత, దర్శకుడు, సింగర్ కూడా ఉన్నారు. భారత్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్స్‌లో హృతిక్ కూడా ఒకరు. మధ్యలో తడబడినా పడి లేచిన కెరటంలా బౌన్స్ బ్యాక్ అయ్యారు. సినిమాలతో పాటు టెలివిజన్‌లోనూ ఆయన హవా చూపిస్తున్నారు. టెలివిజన్ డాక్యుమెంటరీలతో పాటు రియాలిటీ షోలకు జడ్జిగానూ వ్యవహరిస్తున్నారు. ఇక పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనూ హృతిక్ రోషన్ సత్తా చాటుతున్నారు. 2021లో విశాల్ - శేఖర్‌లతో కలిసి చేసిన డీఎన్ఏ మెయిన్ డ్యాన్స్ అనే ఆల్బమ్ ఒక ఊపు ఊపింది.

ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వార్ -2లో హృతిక్ రోషన్ నటిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ విలన్‌గా నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు భారతదేశంలోని ఇద్దరు బెస్ట్ డ్యాన్సర్లు కలిసి సినిమా చేస్తుండటంతో వార్ 2పై హైప్ నెలకొంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ ఏడాది ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

చిన్న వయసులోనే నటి, ఫ్యాషన్ డిజైనర్ సుసానే ఖాన్‌తో ప్రేమలో పడ్డ హృతిక్ రోషన్ ఆమెను పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో హృతిక్ - సుసానే ఖాన్‌లు తమ 14 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టారు. తర్వాత కైట్స్ అనే మూవీలో తనతో కలిసి నటించిన మెక్సికన్ నటి బార్బరా మోరీతో హృతిక్ ఎఫైర్ నడిపించాడు. హృతిక్ తన భార్య నుంచి విడిపోవడానికి బార్బరా కూడా ఒక కారణమనే పుకార్లు అప్పట్లో వినిపించాయి. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌తోనూ ఆయన డేటింగ్ చేయగా ఈ జంట విడిపోయింది. అయితే హృతిక్‌పై అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటుంది కంగన.

ప్రస్తుతం బాలీవుడ్ నటి సబా ఆజాద్‌తో హృతిక్ ప్రేమాయణం సాగిస్తున్నట్లు బీటౌన్ మీడియా చెబుతోంది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని పలుమార్లు మీడియా కంటబడ్డారు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా హృతిక్ - సబా ఆజాద్‌లు వెకేషన్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పెళ్లెప్పుడు అంటూ నెటిజన్లు ఈ జంటను ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X