మా నాన్న అంటే కరోనాకు వణుకు.. ఎందుకో తెలుసా? హృతిక్ వీడియో రిలీజ్

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం చేస్తున్న సమయంలో సినీ ప్రముఖులందరూ స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. హృతిక్ రోషన్ కూడా ప్రభుత్వ ఆదేశాలను గౌరవిస్తూ.. గృహ నిర్బంధంలోనే ఉంటున్నాడు. ఆయనతోపాటు నిర్మాత, తండ్రి రాకేశ్ రోషన్ కూడా క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. అయితే తన తండ్రి గురించి బయటి ప్రపంచానికి చెప్పడానికి హృతిక్ ఓ ఇన్సిపిరేషన్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏమున్నందంటే..

40 ఏళ్లకుపైగా సినీ పరిశ్రమలో

40 ఏళ్లకుపైగా సినీ పరిశ్రమలో

బాలీవుడ్‌లో స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేశ్ రోషన్ ప్రతిభవంతుడైన దర్శక, నిర్మాత. గత 40 ఏళ్లుగా బాలీవుడ్ పరిశ్రమలో పత్తర్ దిల్, హవేలి, ఏక్ ఔర్ సికందర్ లాంి పలు చిత్రాల్లో నటించారు.. ఆప్‌ కే దీవానే, కామ్ చోర్, ఖూన్ బరీ మాంగ్, కరణ్ అర్జున్, కోయి మిల్ గయా, క్రిష్, కహోనా ప్యార్ హై లాంటి చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించారు.

71 ఏళ్ల వయసులో కూడా

71 ఏళ్ల వయసులో కూడా

నాలుగు దశాబద్దాల సినీ ప్రయాణం ఉన్న ఆయన ఆయన వయసు 71 సంవత్సరాలు. ఇప్పటికీ మంచి ఫిట్‌నెస్‌తో కనిపిస్తారు. ఆయన ఫిట్‌నెస్ ఇప్పటికీ ఇండస్ట్రీలో హాట్ టాపికే. అందుకు కారణం.. ఆయన ప్రతీ రోజు రెండు గంటలు వర్కవుట్లు, జిమ్‌లో గడపడమే. ప్రతీ నిత్యం ఎక్సర్‌సైజ్‌లు చేయడమే ప్రాణాంతక వ్యాధులు కూడా ఆయనను ఏమి చేయలేకపోయాయి అని హృతిక్ చెప్పారు.

క్యాన్సర్‌ను ఇలా జయించి

క్యాన్సర్‌ను ఇలా జయించి

గతేడాది రాకేష్ రోషన్ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారు. అయితే ఆయన గుండె నిబ్బరం, మానసిక, శారీరక పటిష్టతే ఆయనను కోలుకునేలా చేసింది. అలాంటి ప్రాణాంతక వ్యాధిని ఎదురించిన నా తండ్రికి ఈ కరోనా వ్యాధి ఓ లెక్కనా? అంటూ హృతిక్ సవాల్ విసిరారు. తాజాగా తండ్రి చేసే ఎక్సర్‌సైజ్‌లకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు.

మా నాన్నంటే కరోనాకు భయం..

హృతిక్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేస్తూ.. మా నాన్న అంటే మజాకా.. ఎన్నడూ దేనికి అంత త్వరగా తలవంచడు. ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదిరించవచ్చో అనే విషయాన్ని ఆయనను చూసి నేర్చుకోవాల్సిందే. 71 ఏళ్ల వయసులో కూడా రెండు గంటలు వర్కవుట్లు చేస్తాడు. అందుకే ఆయన క్యాన్సర్ నుంచి బయడపట్టారు. ఇప్పుడు కరోనావైరస్ వ్యాధి కూడా ఆయనను చూసి భయపడుతున్నదేమో అని అని హృతిక్ రోషన్ అన్నారు.

Recommended Video

Hero Srikanth Father Passed Away
మళ్లీ భార్యతో చేరువగా హృతిక్

మళ్లీ భార్యతో చేరువగా హృతిక్

కరోనా కారణంగా ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించడంతో హృతిక్ రోషన్ ఇంటికే పరిమితమయ్యారు. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కొన్నేళ్ల క్రితం విడిపోయిన భార్య సుసాన్ కూడా తిరిగి వచ్చింది. తమ పిల్లల సంరక్షణ కోసం విభేదాలను పక్కన పెట్టి హృతిక్, సుసానే కలిసిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచమంతా ఒక్కటవుతున్నది. వారిద్దరి కలువడం పెద్ద విషయం కాదు అని హృతిక్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X