ఆ పరిస్థితుల్లోనూ... ప్రియాంక మరొకరి సహాయాన్ని తిరస్కరించిందట!

By Bojja Kumar

ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి కేవలం తన అందం, టాలెంటుతో టాప్ పొజిషన్‌కు ఎదిగిన బ్యూటీ ప్రియాంక చోప్రా. ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగానికే పరిమితం కాకుండా హాలీవుడ్ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళుతోంది. టాలెంటుతో పాటు హార్డ్ వర్క్ ఆమెను ఈ స్థాయికి తీసుకెళ్లాయిన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎవరైనా తనపట్ల సానుభూతి చూపించడాన్ని, సహాయం చేయడాన్ని ప్రియాంక అస్సలు ఇష్టపడదట. 'క్రిష్' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ గుర్తు చేసుకున్నారు. షూటింగ్ సమయంలో వాతావరణాన్ని తట్టుకోలేక అపస్మారక స్థితిలోకి వెళ్లే స్థితిలో ఉన్నప్పటికీ ఎవరి సహాయం తీసుకోవడానికి ఇష్టపడలేదని హృతిక్ చెప్పినట్లు ఆమె జీవితంపై వెలువడిన 'ప్రియాంక చోప్రా: ది డార్క్ హార్స్' అనే పుస్తకంలో పేర్కొన్నారు.

Hrithik Roshan about Priyanka Chopra

'క్రిష్' మూవీ షూటింగ్ మనాలిలోని మంచు కొండల్లో జరిగింది. ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుగడం, గడ్డకట్టే చలికారణంగా గాలిలో ఆక్సీజన్ లెవల్స్ తగ్గడంతో యూనిట్ సభ్యుల్లో చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రియాంక కూడా ఆ పరిస్థితి తట్టుకోలేక కిందపడిపోయే స్థితికి వచ్చింది. ఈ విషయం గమనించిన యూనిట్ సభ్యులు ఆమెకు సహాయం చేసి హోటల్ రూముకు తీసుకెళ్లారు. అలా తన పట్ల సానుభూతి చూపించి సహాయం చేయడాన్ని ప్రియాంక జీర్ణించుకోలేక పోయింది' అని హృతిక్ గుర్తు చేసుకున్నారు.

ప్రియాంక ఎప్పుడూ స్ట్రాంగ్‌గా, ఇండిపెండెంటుగా, సెల్ఫ్ రిలియంట్‌గా ఉండటానికి ఇష్టపడుతుంది. తనను తాను నిరూపించుకోవడానికి ఎంత కష్టానికైనా వెనకాడదు. అదే ఆమెను ఆ స్థాయికి తీసుకెళ్లింది అని హృతిక్ వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X