ఒళ్లు గగుర్బొడిచే యాక్షన్: ‘సాహో’ తర్వాత భారీగా ‘వార్’ (ట్రైలర్)
2019లో ఇండియాలో విడుదల కాబోతున్న అతిపెద్ద యాక్షన్ మూవీ 'సాహో'. ఈ సినిమా వచ్చిన నెల రోజుల గ్యాపుతో 'వార్' అనే మరో యాక్షన్ ఫిల్మ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ప్రఖ్యాత బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ వారు నిర్మిస్తున్నారు.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా దీన్ని తెరకెక్కించినట్లు స్పస్టమవుతోంది. ట్రైలర్లో చూపించిన విమానం చేజింగ్ సీన్లు ఒళ్లు గగుర్బొడిచే విధంగా ఉన్నాయి. ట్రైలర్లోనే రొమాలు నిక్కబొడిచేలా ఉన్న ఈ సీన్లు థియేటర్లో ఎలాంటి అనుభూతిని ఇస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

హాలీవుడ్‌కు చెందిన ఆండీ ఆర్ ఆర్మ్‌స్ట్రాంగ్, దక్షిణ కొరియాకు చెందిన మిస్టర్ ఓహ్ అనే ఇద్దరు యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు ఈ చిత్రానికి యాక్షన్ సీన్లు కంపోజ్ చేశారు. ఇప్పటి వరకు ఇండియన్ సినీ పరిశ్రమలో ఏ సినిమాలో లేని విధంగా అద్భుతమైన పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయని అంటున్నారు.
ఈ చిత్రంలో వాణి కపూర్ హీరోయిన్‌గా హీరోయిన్. ఆమె అందాల ప్రదర్శన సినిమాకు గ్లామర్ లుక్ తెస్తుందని టాక్. అక్బోబర్ 2న ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళంలో విడుదల కాబోతోంది. ఇదే రోజు 'సైరా' కూడా బాక్సాఫీస్ బరిలో దూకుతుండటం గమానార్హం.


Click it and Unblock the Notifications











