అలాంటి వారితో పనిచేయడం నావల్ల కాదు.. హృతిక్ రోషన్ సంచలన వ్యాఖ్యలు!

సూపర్ హీరో హృతిక్ రోషన్ సంచలన ప్రకటన చేశాడు. బాలీవడ్ ని లైంగిక వేధింపుల ఘటనలు కుదిపేస్తున్నాయి. తనుశ్రీ దత్త మొదలుపెట్టిన ఈ ప్రకంపనలు నెమ్మదిగా జోరందుకుంటున్నాయి. నానా పాటేకర్ పై తనుశ్రీ దత్త సంచలన ఆరోపణలు చేయడంతో బాలీవుడ్ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. నెమ్మదిగా ఆమెకు మద్దత్తు పెరిగింది. ఇప్పుడు చాలా మంది బాలీవుడ్ నటీమణులు తమకు ఎదురైనా లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా ప్రస్తావిస్తుండడంతో హాట్ టాపిక్ గా మారింది. నానా పాటేకర్ తరువాత ప్రముఖ దర్శకుడు వికాస్ బహల్ హాట్ టాపిక్ గా మారాడు.

నటిపై బలవంతంగా

నటిపై బలవంతంగా

తనని వికాస్ బహల్ లైంగికంగా వేధించాడంటూ క్రేజీ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కంగనా అతడిపై ఆరోపణలు చేసిన వెంటనే మరో నటి అంతకంటే తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఓ పార్టీ సందర్భంగా వికాస్ తనపై అఘాయిత్యానికి ప్రయతించాడని పేర్కొంది.

ముద్దు పెట్టడానికి

ముద్దు పెట్టడానికి

అందరు పార్టీలో నిమగ్నమై ఉండగా వికాస్ పూర్తిగా మద్యం సేవించి ఉన్నాడు. అతడికి నేను ఓ మూలన ఉండడం కనిపించాను. బలవంతంగా నాపై పడి పెదవులపై ముద్దు పెట్టడానికి ప్రయత్నించాడు. అతడిని దూరంగా నెట్టేశా. అయినా కూడా నీచంగా ప్రవర్తించిన.. నా వెనుకభాగంపై మాస్టర్బెషన్ చేశాడని పేరు ప్రకటించడానికి ఇష్టపడని నటి తీవ్రమైన ఆరోపణలు చేసింది.

నానా పాటేకర్ తరువాత

నానా పాటేకర్ తరువాత

తనుశ్రీ ఆరోపణలతో నానా పాటేకర్ ఎలా హాట్ టాపిక్ గా మారారో.. ఇప్పుడు వికాస్ బహల్ గురించి కూడా అదేస్థాయిలో చర్చ జరుగుతోంది. తీవ్రమైన ఆరోపణలు రావడంతో అవి నిజం కాదని నిరూపించుకోవాల్సిన భాద్యత అతడికి ఏర్పడింది. ప్రస్తుతం ఈ దర్శకుడు హృతిక్ రోషన్ తో సూపర్ 30 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

హృతిక్ రోషన్ సంచలన వ్యాఖ్యలు

ఈ వివాదం విషయంలో హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు సంచలంగా మారాయి. దారుణమైన పనులు చేసినవారితో కలసి నేను పనిచేయడం కుదరదు. ప్రస్తుతం నేను దూరంగా ఉన్నాయి. వార్తల ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నా. సూపర్ 30 నిర్మాతలు ఈ విషయంలో నిజానిజాలు పరిశీలించాలి అంటూ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.

 కఠిన నిర్ణయం తీసుకోండి

కఠిన నిర్ణయం తీసుకోండి

ఒకవేళ ఆరోపణలు నిజమైతే కఠిన నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడవద్దు. ఈ విషయాన్ని అణచిపెట్టడానికి వీల్లేదు. ఆరోపణలు నిజమైతే కఠినంగా శిక్షించాలి అంటూ హృతిక్ రోషన్ స్పందించాడు. హృతిక్ రోషన్ వ్యాఖ్యలతో సూపర్ 30 చిత్రం ఆగిపోయే ప్రమాదం కూడా ఉందనే వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X