క్రిష్ 4ను డైరెక్ట్ చేయబోతున్న హృతిక్.. టార్గెట్ గా అల్లు అర్జున్.. కానీ

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. సూపర్ హీరో ఫిలిం క్రిష్ 4ను తనే డైరెక్ట్ చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన వచ్చేసింది. 1980 నుంచి హృతిక్ రోషన్ వెండి ధరపై వెలుగుతూనే ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మొదలైన ఆయన సినీ ప్రయాణం నేటికి విజయవంతంగా కొనసాగుతోంది. హీరోగా ఇప్పటికీ 30 కి పైగా సినిమాలు చేశారు హృతిక్ రోషన్. ఇండియన్ యాక్షన్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు.

హృతిక్ రోషన్ కెరియర్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద రికార్డును సెట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అందులో క్రిష్ సిరీస్ బ్రహ్మాండమైన ప్రేక్షక ఆదరణ పొందింది. ఈ ఫ్రాంచైస్ లో మొదట 'కోయి మిల్ గయా'.. చిత్రం మొదటగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2003లో విడుదలైన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీని హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ నిర్మించారు. హృతిక్ రోషన్ డెబ్యూ ఫిలిమ్ ను కూడా రాకేష్ రోషనే నిర్మించడం విశేషం.

Hrithik Roshan directorial debut with krrish 4 Confirmed His fan shocking comment on Allu Arjun movie

అయితే క్రిష్ ఫ్రాంచైజీలో కోయి మిల్ గయా.. తర్వాత క్రిష్, క్రిష్ 3 ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఫ్రాంచైజీ అన్నింటిలో హృతిక్ రోషన్ హీరో నటించడం విశేషం. ఇక ఫ్రాంచైజీలో నెక్స్ట్ క్రిష్ 4 ఎప్పుడు రాబోతుందా అంటూ ఆడియన్స్, ఫాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. కాగా, తాజాగా గుడ్ న్యూస్ అందింది. మరోవైపు సర్ప్రైజింగ్ అప్డేట్ ను కూడా అందించారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్, హృతిక్ రోషన్ తండ్రి తన ఇన్స్టాగ్రామ్ వేదికన క్రిష్ 4 పై అధికారిక ప్రకటన ఇచ్చారు.

క్రిష్ 4 చిత్రాన్ని తన కొడుకు, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ స్వయంగా డైరెక్ట్ చేయబోతున్నారంటూ ప్రకటించారు. ఇక నిర్మాతలుగా తనతో పాటు ఆదిత్య చోప్రా వ్యవహరిస్తున్నారని రాకేష్ రోషన్ వెల్లడించారు. తొలిసారి డైరెక్షన్ చేయబోతుండడంతో హృతిక్ రోషన్ కు తండ్రి రాకేష్ రోషన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ న్యూ జర్నీలో మంచి సక్సెస్ సాధించాలని ఆకాంక్షించారు. ఈ ప్రకటన రావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగ రాయబోతున్నాడు అంటూ తమ అభిమాన హీరో హృతిక్ రోషన్ ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తారు.

అయితే, హృతిక్ రోషన్ అభిమాని ఒకరు ఆసక్తికరంగా పోస్ట్ పెట్టారు. హృతిక్ రోషన్ క్రిష్ 4 డైరెక్ట్ చేయడంతో అల్లు అర్జున్ పుష్ప 2 : ది రూల్ బాక్సాఫీస్ రికార్డు చెరిగిపోతుందంటూ అత్యుత్సాహన్ని ప్రదర్శించారు. అయితే ఇప్పటికే బాలీవుడ్ ని దాటేసి టాలీవుడ్ ప్రపంచవ్యాప్తంగా సినిమా మార్కెట్ ను పెంచుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నార్త్ ఆడియన్స్ నుంచి ఇలాంటి కామెంట్లు వస్తుండడం ఇంట్రెస్టింగా మారింది. ఇక అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద 1870 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మరి ఆ రికార్డును హృతిక్ రోషన్ దాట గలుగుతాడా అనేది వేచి చూడాలి. ఇక క్రిష్ 4ను హృతిక్ రోషన్ డైరెక్ట్ చేయబోతున్నడంతో తాను నటిస్తారా లేదా అన్నది సందేహంగా మారింది. మున్ముందు దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X