హృతిక్ రోషన్ గర్ల్ ఫ్రెండ్ పోస్ట్ పై.. మాజీ భార్య ఆసక్తికర కామెంట్.. ఏమన్నారంటే?

హృతిక్ రోషన్ సుస్సానే ఖాన్‌తో విడాకులు తీసుకున్నప్పటి నుండి సింగిల్ గానే ఉంటూ వచ్చినా ఈ మధ్య మాత్రం ఒక యువతితో డేటింగ్ చేస్తున్న క్రమంలో వార్తల్లో ఉన్నారు. సబా ఆజాద్‌తో హృతిక్ రోషన్ డేటింగ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే అనూహ్యంగా సుస్సానే ఖాన్ స్వయంగా సబా ఆజాద్‌ను ప్రశంసించారు. సబా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కమర్షియల్ పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో ఆమె చాలా లోకల్ డ్రెస్సింగ్లో ఉండగా దానికి సుస్సానే ఆసక్తికర కామెంట్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

ఇంటర్నెట్‌లో వైరల్

ఇంటర్నెట్‌లో వైరల్

సబా ఆజాద్ -హృతిక్ రోషన్‌ల సంబంధం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇద్దరూ చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారని పుకార్లు వచ్చాయి కానీ వారు బహిరంగంగా అంగీకరించలేదు అలా అని తిరస్కరించలేదు. వారు ఇద్దరూ అనేక సందర్భాల్లో కలిసి కనిపించారు, అయితే ఇద్దరూ కలిసి గత నెలలో కరణ్ జోహార్ పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు.

దీంతో ఈ డేటింగ్ పుకార్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దాదాపు అదే సమయంలో, హృతిక్ రోషన్, సబా ఆజాద్, సుస్సానే ఖాన్ అలాగే అర్స్లాన్ గోనీ కలిసి పోజులిచ్చిన ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.

స్వీట్ కామెంట్

స్వీట్ కామెంట్

అయితే తాజాగా హృతిక్ మాజీ భార్య సుస్సానే హృతిక్ గర్ల్ ఫ్రెండ్ సబా ఆజాద్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై కామెంట్ చేయడంతో ఆసక్తికరమైన పరిణామం జరిగిందని అంటున్నారు. సబా ఆజాద్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రోజువారీ అప్‌డేట్‌లను పంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. అయితే ఆమె ఒక కమర్షియల్ యాడ్ ను షేర్ చేసింది. అయితే అక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె పోస్ట్ కింద సుస్సేన్ ఖాన్ చేసిన ఒక స్వీట్ కామెంట్.

సో ప్రెట్టీ సాబూ

సో ప్రెట్టీ సాబూ

ఆమె ప్రేమను చూపించే ఎమోజీలు షేర్ చేసి "సో ప్రెట్టీ సాబూ" అని కామెంట్ చేసింది. ఆమె కామెంట్ హృతిక్ మాజీ భార్య అలాగే గర్ల్ ఫ్రెండ్ మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయాన్ని తేటతెల్లం చేసినట్టు అయింది. సబా ఆజాద్ రోషన్లు నిర్వహించే కుటుంబ సమావేశాల్లో కూడా భాగం అవుతున్నారు. ఇటీవల, హృతిక్ రోషన్ తండ్రి మరియు ప్రముఖ దర్శకుడు రాకేష్ రోషన్ ఈషాన్ రోషన్ బర్త్ డే బాష్ నుండి ఒక ఫోటోను పంచుకున్నారు.

 సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి

సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి

సబా కూడా ఆ వేడుకలో భాగమయ్యారు. ఇక ఈ ట్రేండింగ్ కపుల్ తమ బంధాన్ని ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారో చూడాలి. ఇక సినిమాల విషయానికి వస్తే హృతిక్ రోషన్ తన 2019 బ్లాక్‌బస్టర్ వార్ తర్వాత, విక్రమ్ వేద యొక్క అధికారిక హిందీ రీమేక్‌లో సైఫ్ అలీ ఖాన్‌తో కలిసి కనిపించనున్నారు.

ఫైటర్‌లో

ఫైటర్‌లో

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఈ సినిమా ఒకటిగా నిలుస్తోంది. విక్రమ్ వేద తర్వాత, హృతిక్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఫైటర్‌లో కనిపించనున్నారు. ఆ సినిమాలో దీపికా పదుకొనే మరియు అనిల్ కపూర్ కూడా నటించనున్నారు . సబా ఆజాద్ చివరిగా ది రాకెట్ బాయ్స్‌లో కనిపించారు. ఆమె తదుపరి ఫీచర్ ప్రాజెక్ట్ పేరు 'మినిమం'.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X