Hrithik Roshan నన్ను క్షమించు హృతిక్.. లవర్ సబా సోషల్ మీడియా పోస్టు వైరల్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితంలోనే వార్తల్లో నిలుస్తున్నాడు. పద్నాలుగేళ్ల వైవాహిక జీవితం అనంతరం తన భార్య సుసానే ఖాన్‌కు హృతిక్ 2014లో విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలువురితో డేటింగ్ చేసిన హృతిక్ పలుమార్లు మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. అయితే తాజాగా కుర్ర హీరోయిన్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరగడం బాలీవుడ్ మీడియాలో ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

కంగన రనౌత్‌తో అఫైర్

కంగన రనౌత్‌తో అఫైర్

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌తో ప్రేమాయణం సాగిస్తున్న సమయంలో భార్య నుంచి హృతిక్ విడిపోయాడు. అయితే ఆ తర్వాత హృతిక్, కంగన మధ్య వ్యవహారం కూడా ఎక్కువ సేపు సాగలేదు. ఇద్దరూ విడిపోయి ఒకరినొకరు బహిరంగంగానే తిట్టుకున్నారు. మీడియాలో వారిద్దరి వ్యవహారం రచ్చగా మారింది. కోర్టులు, పరువు నష్టం దావా వరకు ఈ వ్యవహారం వెళ్లింది. ఆ క్రమంలో పిల్లల కోసం హృతిక్ తిరిగి మాజీ భార్యకు దగ్గరయ్యాడు.

భార్యతో ప్యాచప్ వార్తలు.. అంతలోనే..

భార్యతో ప్యాచప్ వార్తలు.. అంతలోనే..

సుసానే నుంచి విడిపోయినా పిల్లల కోసం తరచుగా హృతిక్ మాజీ భార్యను కలుసుకునేవాడు. నలుగురూ కలిసి విహార యాత్రలకు కూడా వెళ్లేవారు. కరోనా మొదటి వేవ్ లాక్‌డౌన్ సమయంలో సుసానే, హృతిక్ తమ పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు. దీంతో భార్యతో మళ్లీ హృతిక్ ప్యాచప్ అవుతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అవి కేవలం పుకార్లు మాత్రమేనని తాజాగా తేలిపోయింది. యంగ్ హీరోయిన్ సబా ఆజాద్‌తో హృతిక్ బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రారంభించాడు. తరచుగా డిన్నర్‌, లంచ్‌ డేట్‌లకు కలిసి వెళ్లడం, కెమెరాలకు కనబడకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించడం వంటివి చేస్తూ మీడియాకు దొరికిపోయారు. దీంతో వారి ప్రేమాయణం గురించి వార్తలు మొదలయ్యాయి.

ఏకంగా ఇంటికే తీసుకెళ్లిన హృతిక్..

ఏకంగా ఇంటికే తీసుకెళ్లిన హృతిక్..


డిన్నర్ డేట్‌లకు మాత్రమే కాకుండా ఏకంగా తన కుటుంబ సభ్యుల సమావేశానికి కూడా సబాను తీసుకెళ్లి ఈ గ్యాసిప్‌లకు హృతిక్ మరింత ఆజ్యం పోశాడు. కొన్ని రోజుల క్రితం హృతిక్‌ అంకుల్‌ రాజేశ్‌ రోషన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తమ ఫ్యామిలీ ఫొటోను పంచుకున్నాడు. ఆ ఫొటోలో హృతిక్ కుటుంబ సభ్యులతో పాటు సబా కూడా ఉంది. కాగా, సబా సోషల్ మీడియా పోస్ట్‌లపై కూడా హృతిక్ కామెంట్లు చేస్తున్నాడు. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పాత బెంగాలీ పాట గురించి సబా పోస్ట్ చేసింది. చిన్నప్పటి నుంచి తనకు ఎంతో ఇష్టమైన ఆ పాటను పాడుతూ ఓ వీడియోను పంచుకుంది. తప్పులు, ఉచ్ఛారణ దోషాలు ఉంటే క్షమించమని కోరింది. ఆ పోస్ట్‌పై స్పందించిన హృతిక్.. నువ్వు చాలా అసాధారణ ప్రతిభ గల వ్యక్తివి అంటూ కామెంట్ చేశాడు.

ఎవరీ సబా

ఎవరీ సబా


'దిల్‌ కబడ్డీ', 'ముజే ఫ్రెండ్‌షిప్‌ కరోగే', 'రాకెట్‌ బాయ్స్‌' చిత్రాల్లో నటించిన సబా బాలీవుడ్‌లో ఓ మోస్తరు గుర్తింపు సంపాదించుకుంది. కాగా గతంలో ఆమె ప్రముఖ నటుడు నసీరుద్దీన్‌ షా తనయుడు ఇమాద్‌తో ప్రేమాయణం నడిపినట్టు సమాచారం. వీళ్లిద్దరూ ఏడేళ్లపాటు సహజీవనం కూడా చేశారట. 2020లో ఇమాద్ నుంచి విడిపోయిన్ సబా.. హృతిక్‌‌కు చేరువైంది. తరచుగా అతడితో కలిసి బహిరంగంగానే తిరుగుతోంది. అయితే తమ ప్రేమ వ్యవహారంపై ఈ ఇద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు. మరి, వీరి ప్రేమ వ్యవహారంలో ఎప్పటికి క్లారిటీ వస్తుందో చూడాలి.

సబా ఆజాద్ సినీ కెరీర్ ఇలా..

సబా ఆజాద్ సినీ కెరీర్ ఇలా..


సబా ఆజాద్ విషయానికి వస్తే.. దిల్ కబాడ్డీ అనే సినిమాతో 2008లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ముజ్‌సే ఫ్రాండ్‌షిప్ కరోగి చిత్రంల నటించారు. ఇటీవల నెటిఫ్లిక్స్ ఒరిజినల్ ఫీల్స్ లైక్ ఇష్క్ అనే సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం రాకెట్ బాయ్స్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. పలు ప్రాజెక్టులు చర్చల దశలో పెట్టి.. ప్రస్తుతం హృతిక్‌తో డేటింగ్ విషయం ద్వారా మరింత పాపులారిటి సంపాదించుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X