హృతిక్ అరుదైన ఘనత.. ప్రపంచంలోనే అత్యంత హ్యాండ్సమ్‌ హీరోగా రికార్డు

సినీ కుటుంబం నుంచి వచ్చినా సొంత ప్రతిభతో భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు హృతిక్‌ రోషన్‌. చాలా మంది హీరోలకు లవర్‌బాయ్‌ అనో, యాక్షన్‌ హీరో అనో ఓ ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. హృతిక్‌ వీటికి అతీతం. తన ప్రతి సినిమాతో ప్రేక్షకులకు కొత్తదనాన్ని రుచి చూపిస్తుంటాడు. అందుకు అతడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

డ్యాన్సులు, అందం, యాక్టింగ్, ఫైట్స్ ఇలా ఏదైనా సునాయాసంగా చేయడంలో హృతిక్‌ది అంద వేసిన చేయి. అందుకే అతడి సినిమా అంటే హిందీ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తుంది. హృతిక్‌కు ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ కారణంగానే అతడి సినిమాలను విదేశాల్లో ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేస్తుంటారు. ఈ క్రమంలోనే కలెక్షన్లు సాధిస్తుంటాయి అతడి సినిమాలు.

Hrithik Roshan Got No 1 Spot in most handsome men in the world

ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఈ హీరో ఎన్నో ఘనతలు సాధించాడు. భారత్‌లోని అత్యంత ప్రభావవంతమైన ఫోర్బ్స్ వందమంది ప్రముఖుల జాబితాలో హృతిక్‌ ఒకరు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోగా హృతిక్‌కు పేరుంది. భారత్‌లో అత్యంత ఆకర్షణీయమైన కథానాయకుడిగా, ప్రపంచ అందగాడిగా పేరు ఉంది. తాజాగా ఇది మరోసారి నిరూపణ అయింది.

2019 సంవత్సరానికి గానూ తాజాగా విడుదల చేసిన టాప్ - 5 మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ జాబితాలో హృతిక్‌కు మొదటి స్థానం దక్కింది. క్రిస్ ఎవాన్స్, డేవిడ్ బెక్హాం, రాబర్ట్ ప్యాటిన్సన్ వంటి వారి నుంచి గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ హృతిక్ 'ది మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ ఇన్ ది వరల్డ్' జాబితాలో మొదటి స్థానం దక్కించుకున్నాడు. దీంతో హృతిక్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

హృతిక్ రోషన్ ఇటీవల 'సూపర్ 30' అనే సినిమా చేశాడు. ఇందులో హృతిక్ గణిత శాస్త్రవేత్తగా నటించాడు. బీహార్‌కు చెందిన ఆనంద్ కుమార్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం. సాధారణ జీవినం గడుపుతున్న ముప్పై మందిని ఈ శాస్త్రవేత్త ఎలా ప్రయోజకులను చేశాడన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా రూ. 140 కోట్లు వసూలు చేసింది. దీని తర్వాత అతడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి 'వార్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది అక్టోజర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X