చేతి కర్రతో హృతిక్ రోషన్.. వార్ 2 హీరోకి ఏమైంది? ఆందోళనలో ఫ్యాన్స్
బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్రీకు వీరుడిలాంటి లుక్‌లో హాలీవుడ్ స్టార్స్‌ను మించిన అందంతో మెరిసిపోతుంటారు. 50 ప్లస్‌లోనూ చెక్కుచెదరని గ్లామర్‌తో కుర్రాళ్లకు పోటీ ఇస్తున్నారు హృతిక్. గతేడాది జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ఆయన నటించిన వార్ 2 చిత్రం ఎన్నో అంచనాల మధ్య రిలీజైంది. అయితే మిక్స్‌డ్ టాక్ కారణంగా ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలని హృతిక్ రోషన్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ దశలో ఆయన ఆరోగ్యంపై బాలీవుడ్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే...
చేతికర్రతో కుంటుతూ హృతిక్ రోషన్
ఇటీవల ముంబైలో జరిగిన నిర్మాత గోల్డీ బెహల్ పుట్టినరోజు వేడుకలకు హృతిక్ రోషన్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో మోచేతికి గాయంతో ఊతకర్రల సాయంతో కుంటుతూ కనిపించారు. ఇదే సమయంలో ఆయన ఫోటోగ్రాఫర్లకు ఫోజు ఇవ్వడానికి కూడా నిరాకరించారు. బీటౌన్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం.. గతేడాది మార్చిలో హృతిక్ మోకాలికి గాయమైంది. కొంతకాలం తర్వాత ఆయన కోలుకున్నప్పటికీ అది ఇప్పుడు మళ్లీ తిరగబెట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో తమ హీరోకి ఏమైంది? ఏం జరిగిందంటూ హృతిక్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలోనూ మోకాలి నొప్పితో ఇబ్బందులు
ఇటీవల కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ జిందగీ నా మిలేగీ దోబారా చిత్రంలోని సెనోరిటా పాట చిత్రీకరణ సమయంలో హృతిక్ గతంలోనూ మోకాలి నొప్పితో ఇబ్బందులు పడినట్లు వెల్లడించారు. మిర్చి ప్లస్‌తో జరిపిన సంభాషణ కార్యక్రమంలో మార్టిస్ మాట్లాడుతూ... సెనోరిటా చాలా కష్టమైన పాట.. ఆ సాంగ్ షూటింగ్ సమయంలో హృతిక్ తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. అయినప్పటికీ నొప్పిని పంటి బిగువన భరించి హృతిక్ ఆ పాటలో అద్భుతంగా డ్యాన్స్ చేశారని మార్టిస్ ప్రశంసించారు.
వందకు పైగా రిహార్సల్స్
అలాగే బ్యాంగ్ బ్యాంగ్ మూవీలోని ఐకానిక్ సాంగ్.. తూ మేరీ చిత్రీకరణ సమయంలోనూ హృతిక్ తన అంకిత భావాన్ని చాటుకున్నారని మార్టిస్ గుర్తుచేసుకున్నారు. ఈ పాటలో స్టెప్స్ మూవ్‌మెంట్ సరిగా వచ్చే వరకు వందలాది సార్లు సాధన చేశారు. తూ మేరీ సాంగ్ షూటింగ్ సమయంలో ఫ్లోర్ కోసం దాదాపు 5 గంటలు వేచి ఉండాల్సి వచ్చినా అలాగే హృతిక్ ఓపికగా ఉన్నారని కొరియోగ్రాఫర్ తెలిపారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ తనకు బాగా అచ్చొచ్చిన క్రిష్ 4లో నటిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు హృతిక్ రోషన్ స్వయంగా మెగా ఫోన్ పట్టుకుని దర్శకత్వం వహిస్తున్నారు. దాంతో క్రిష్ 4పై అప్పుడే బాలీవుడ్‌లో భారీ హైప్ నెలకొంది.
మాజీ భార్య, ప్రియురాలితో బర్త్ డే పార్టీ
ఇక హృతిక్ రోషన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే... ఇటీవల జనవరి 10వ తేదీన తన 52వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గ్రాండ్ పార్టీలకు దూరంగా.. తనకు అత్యంత సన్నిహితులైన కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో తన ప్రియురాలు సబా ఆజాద్‌తో పాటు మాజీ భార్య సుసాన్ ఖాన్, వారి కుమారులు హ్రేహన్, హ్రిదాన్ ఉన్నారు. దీంతో మాజీ భార్యకు, ప్రియురాలికి ఆయన ఎంత గౌరవం ఇస్తున్నారనేది తెలిసింది. ఇది చూసిన అభిమానులు తమ హీరో వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











