For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అద్దె ఇంట్లో ఉంటున్న హృతిక్ రోషన్.. గోడ కూడా సరిగ్గా లేదు.. నెలకు రెంట్ ఎంతో తెలుసా?

  |

  ఇండియన్ స్టార్స్ లో అత్యధిక వేగంగా డాన్స్ చేసే అతి కొద్ది మంది హీరోలలో హృతిక్ రోషన్ ఒకరు. ఫిట్నెస్ తో కూడా ఎప్పటికప్పుడు సరికొత్త గా కనిపించే ఈ కండలవీరుడు కూల్ గా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తాడు. అయితే అప్పుడప్పుడు అనుకోకుండా కొన్ని వివాదాల్లో చిక్కుకుంటు ఉంటాడు. హృతిక్ రోషన్ ఎక్కువగా సింపుల్ లైఫ్ ను ఇష్టపడతారు అని అంటారు. అది నిజమే అయినప్పటికీ మరికొన్ని రోజుల్లో మాత్రం అతను ఒక విలాసవంతమైన ఇంట్లోకి వెళ్లబోతున్నాడు.

  హృతిక్ రోషన్ ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో మాత్రమే ఉంటున్నాడు. అది కూడా ఎంతో నాసిరకంగా ఉన్న ఇంట్లో ఉన్నట్లు అర్థమవుతోంది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా హృతిక్ అనుకోకుండా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో బాలీవుడ్ మీడియాలో ఆ ఫోటో హాట్ టాపిక్ గా మారింది.

  విభిన్నమైన స్టోరీలు

  విభిన్నమైన స్టోరీలు

  బాలీవుడ్ యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందకుండా హృతిక్ రోషన్ వెండి తెరపై కనిపించే చాలా రోజులు అవుతొంది. చివరగా 2019లో సూపర్ 30, వార్ సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. వీలైనంత వరకు ఈ భిన్నమైన ప్రయోగాత్మకమైన కథలను ఎక్కువగా చేసేందుకు ట్రై చేస్తున్నాడు. వార్ లాంటి యాక్షన్ సినిమాలోనే కాకుండా సూపర్ 30 బయోపిక్ లను కూడా టచ్ చేస్తున్నాడు.

  ముందు జాగ్రత్త కాస్త ఎక్కువే..

  ముందు జాగ్రత్త కాస్త ఎక్కువే..

  యాక్టింగ్ విషయంలో హృతిక్ రోషన్ తీసుకునే జాగ్రత్తలు అన్నీఇన్నీ కావు. అతను ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు అంటే ముందుగానే పాత్రకు సంబంధించిన అన్ని కోణాల్లో వర్క్ షాప్ ను నిర్వహిస్తాడు ముందుగానే ఇలాంటి సీన్స్ చేయాలి అనే విషయంలో దర్శకుడుతో పక్కాగా ప్లాన్ చేసుకుంటాడు. ఒక సినిమా తెరకెక్కుతోంది అంటే ఫినిష్ అయ్యే వరకు సక్సెస్ అయ్యే విధంగానే కలిసి పని చేస్తూ ఉంటాడు.

  భారీగా ఆదాయం పెంచుకుంటూ

  భారీగా ఆదాయం పెంచుకుంటూ

  హృతిక్ రోషన్ ఆదాయం అందుకోవడంలో కూడా నిత్యం బాలీవుడ్ హీరోలకు పోటీ ఇస్తూనే ఉంటాడు. క్రిష్ సిరీస్ తర్వాత అతని స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా అతని మార్కెట్ కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దాంతోపాటు కమర్షియల్ యాడ్స్ కూడా ఎక్కువ అయ్యాయి. కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా తన ఆదాయాన్ని పెంచుకుంటున్నాడు.

  రెమ్యునరేషన్ ఎంతంటే..

  రెమ్యునరేషన్ ఎంతంటే..

  ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్న హృతిక్ రోషన్ ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ కొనసాగేందుకు కూడా దాదాపు అదే స్థాయిలో ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో కూడా అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఒక్క ఫోటో పోస్ట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతుంటుంది.

  అద్దె ఇంట్లోనే.. రెంట్ ఎంతంటే?

  అద్దె ఇంట్లోనే.. రెంట్ ఎంతంటే?

  ఇటీవల ఒక ఫోటోను పోస్ట్ చేయగా అందులో అతని ఇల్లు కూడా నాసిరకంగా తడిగా ఉండడం కనిపిస్తుంది.ఈ ఫోటోలో హృతిక్ తల్లి పింకీ రోషన్ కూడా బాల్కనీ దగ్గర నిలబడి ఉంది. మా అమ్మతో ఒక లేజి బ్రేక్ ఫాస్ట్ అంటూ హృతిక్ ఈ పోటోకి క్యాప్షన్ ఇచ్చాడు. ఇక అతని అభిమానులలో ఒకరు తడిగా ఉన్న గోడను గుర్తించినట్లు కామెంట్ చేయగా.. అందుకు హృతిక్ నేను ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసిస్తున్నాను. త్వరలో నా స్వంత ఇల్లు కొంటాను.. అని వివరణ ఇచ్చారు. ఇక గత సంవత్సరం అక్టోబర్‌ నుంచి ముంబై జుహూ లో ఉంటున్న అద్దె ఇంటికి నెలకు రూ. 8.25 లక్షలు చెల్లిస్తున్నట్లు సమాచారం.

  Pelli SandaD Teaser | Teaser Launch By King Nagarjuna
  డ్రీమ్ హౌజ్.. ధర ఎంతంటే?

  డ్రీమ్ హౌజ్.. ధర ఎంతంటే?

  ఇక ప్రస్తుతం ముంబైలోనే బీచ్ దగ్గరగా ఉన్న ఒక అపార్ట్మెంట్ లోనే 38,000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్‌ను రూ. 97.5 కోట్ల వ్యయంతో ఒక కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వాటిని రెండు ఫ్లాట్స్ గా విభజించినట్లు తెలుస్తోంది. ఇక ఆ డ్రీమ్ హౌజ్ కోసం హృతిక్ రోషన్ గత ఐదేళ్లుగా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ స్టార్ హీరో క్రిష్ 4 సినిమా షూటింగ్ కోసం సిద్ధం కానున్నాడు.

  English summary
  Hrithik Roshan huge amount for a rented flat with damp wall..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X