హృతిక్ రోషన్ నికర ఆస్తుల విలువ.. ఎన్ని వేల కోట్లు సంపాదించాడో తెలుసా?
బాలీవుడ్ స్టార్ హీరో, ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో హృతిక్ రోషన్ 25 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉన్నారు. హిందీ భాషా చిత్రాల్లో నటిస్తూ వచ్చారు. తన ప్రతి సినిమాతో ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంటూ వచ్చారు. ప్రస్తుతం భారత దేశంలోనే అగ్ర హీరోగా ఉన్నారు. వరల్డ్ వైడ్ గా హ్యాండసమ్ హీరోల్లో టాప్ 5లో హృతిక్ రోషన్ ఒకరు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి వార్ 2 మల్టీస్టారర్ ఫిల్మ్ తో అలరించేందుకు సిద్ధం అయ్యారు. ఈ క్రమంలో హృతిక్ రోషన్ నెట్ వర్త్ ఎంత? రెమ్యునరేషన్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
బాల నటుడిగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా..
హృతిక్ రోషన్ బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పలు చిత్రాలకు పని చేశారు. తొలుత 1980లో ఆశా అనే చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఆపా దివానే , ఆస్ పాస్, భగవాన్ దాదా వంటి చిత్రాల్లో బాల నటుడిగా మెప్పించారు. ఇక అసిస్టెంట్ డైరెక్టర్ గా కుద్గర్జ్, కింగ్ అంకుల్, కరణ్ అర్జున్, కోయ్లా వంటి సినిమాలకూ పని చేశారు. ఇక హీరోగా 2000 నుంచి హృతిక్ రోషన్ తన ఫిల్మ్ కెరీర్ ను ప్రారంభించారు. కహో నా ప్యార్ హై చిత్రంతో తొలిసారిగా లీడ్ రోల్ లో నటించి మెప్పించారు.

హృతిక్ రోషన్ భారీ రెమ్యునరేషన్..
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హృతిక్ రోషన్ అగ్ర హీరోగా ఎదిగారు. హీరోగా 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని ముగించుకున్నారు. ఇప్పటి వరకు 30 చిత్రాల్లో నటించి మెప్పించారు. కోయి మిల్ గయా, క్రిష్, ధూమ్ 2, జోదా అక్బర్ వంటి చిత్రాలతో భారీ బ్లాక్ బస్టర్స్ ను అందుకున్నారు. జిందగీ నా మిలేగీ దోబారా, అగ్నీపథ్, క్రిష్ 3, సూపర్ 30, వార్ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలతో అలరించారు. ఇక చివరిగా ఫైటర్ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు హృతిక్. ఆ చిత్రానికి 82 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారు. ఇక వార్ 2 చిత్రానికి 48 కోట్ల పారితోషికం, ప్రాఫిట్ షేర్ తీసుకొంటున్నారని తెలుస్తోంది. ఇలా తన ప్రతి సినిమాకు 100 నుంచి 200 కోట్ల రూపాయల పారితోషికాన్ని మాత్రం పొందుతూ ఉంటారు.
ప్రాపర్టీస్, బిజినెస్ లు..
హృతిక్ రోషన్ కు తన యాక్టింగ్ కెరీర్ తోనే కాకుండా పలు వ్యాపారాలతోనూ ఆదాయం వస్తుండటం విశేషం. HRX బ్రాండ్ నేమ్ తో స్పోర్ట్స్ వేర్, ఫిటెస్ దుస్తులు, పరికరాలు, యాక్సెసరీస్ వంటివి పెద్ద ఎత్తున సేల్ చేస్తున్నారు. మరోవైపు పలు ప్రొడక్షన్ కంపెనీల నుంచి వచ్చే చిత్రాల్లోనూ ఇన్వెస్ట్ మెంట్ చేస్తుంటారు. అలాగే రియల్ ఎస్టేట్ లోనూ పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో భారీ విలువ చేసే ప్రాపర్టీస్ ను హృతిక్ రోషన్ తన సొంతం చేసుకున్నారు.
హృతిక్ రోషన్ నెట్ వర్త్..
హృతిక్ రోషన్ కు సినిమాల ద్వారా వచ్చే ఆదాయం, లునావాలా, జూహు వంటి ఖరీదైన ప్రాంతాల్లో 100ల కోట్లు విలువ చేస్తే ఫాంహౌజ్ లు, ఇల్లులు, లగ్జరీ కార్లు, తన తండ్రి రాకేశ్ రోషన్ స్థాపించిన ప్రొడక్షన్ హౌజ్ లో పెట్టుబడులు, వ్యాపారాలు, బ్రాండ్స్ ప్రమోట్ చేయడం ద్వారా ఏడాదికి 300 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఇలా నికర ఆస్తులన్నీ కలుపుకొని హృతిక్ రోషన్ నెట్ వర్క్ 3200 కోట్ల రూపాయలు ఉంటుందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి.


Click it and Unblock the Notifications











