For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అప్పడాలు అమ్ముతూ స్టార్ హీరో.. పిక్ చూసి షాకవుతున్న నెటిజన్లు

|

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అప్పడాలు అమ్ముతూ కనిపించి షాకిచ్చాడు. ఓ బస్సు పక్కన మాసిన బట్టలతో హృతిక్‌ని అలా చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే తాను అప్పడాలు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో తెలుపుతూ సదరు పిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు హృతిక్ రోషన్.

హృతిక్ రోషన్ అప్పడాలు అమ్మింది ఓ సినిమా కోసం. కథ డిమాండ్ చేయాలి గానీ ఎలాంటి పాత్రలో నైనా నటిస్తానని ఈ లుక్ ద్వారా మరోసారి నిరూపించాడు ఈ బాలీవుడ్ హీరో. హృతిక్ రోషన్ హీరోగా వికాస్‌ భల్‌ దర్శకత్వంలో సూపర్ 30 అనే సినిమా తెరకెక్కుతోంది. నడియాద్‌వాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Hrithik Roshan papad selling look viral on social media

గణిత శాస్త్రవేత్త ఆనంద్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హృతిక్‌ రోషన్‌ డీ గ్లామర్‌ రోల్ పోషిస్తున్నాడు. ఆనంద్ తన జీవితంలో పడిన కష్టాలను, జీవిత పోరాటం కోసం పడిన పాట్లను కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు గాను హృతిక్ అతని పాత్రలో లీనమై నటిస్తున్నాడు. మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన గణిత శాస్త్రవేత్త ఆనంద్ జాతీయ స్థాయి పురస్కారాలు ఎలా అందుకున్నారో ఈ సినిమాలో చూపించనున్నారు.

కాగా షూటింగ్‌లో భాగంగా ఆనంద్ పాత్రలో అప్పడాలమ్ముతూ దిగిన పిక్ షేర్ చేశారు హృతిక్ రోషన్. ఈ మేరకు ''ఆనంద్‌ జీవిత ప్రయాణంలో చాలా కీలకమైన ఘట్టం అప్పడాలు అమ్మడం. ఆ సమయంలో ఆయన పడిన భావోద్వేగమే.. తరువాత సాధించిన విజయాలకు పునాదిగా మారింది'' అని ట్వీట్ చేశారు హృతిక్. ఈ డీ గ్లామర్ లుక్ లో హృతిక్‌ని చూసి ఒక్కసారిగా షాకైన నెటిజన్లు.. ఓ స్టార్ హీరో ఇలాంటి ఇన్స్పైరబుల్ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా జులై 12 వ తేదీన సూపర్ 30 ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
In Super 30, Hrithik Roshan will be seen stepping into the shoes of Anand Kumar, a mathematician from Bihar. To get into his character, Hrithik had to go through a lot of struggle.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more