Ramayana: దారుణంగా రామాయణం టీజర్ .. హృతిక్ రోషన్ హాట్ కామెంట్స్!
భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతున్న బాలీవుడ్ చిత్రం రామాయణం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ కాంబినేషన్‌లో వస్తున్న పౌరాణిక చిత్రం రామాయణ. ఈ చిత్రంలో రవి దుబే, సాయి పల్లవి, సన్నీ డియోల్, యష్, అమితాబ్ బచ్చన్, లారా దత్తా, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, శోభన తదితరులు నటిస్తున్నారు.
ఈ సినిమా పాటలకు ఏఆర్ రెహ్మన్ సంగీతం అందిస్తుండగా, హ్యాన్స్ జిమ్మర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మానస్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల చేశారు. అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది. ఈ సినిమా ట్రైలర్‌లో కనిపించిన గ్రాఫిక్స్ వర్క్ విషయంలో ఆదిపురుష్ కంటే దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది. అయితే ఈ సినిమాలో నటిస్తున్న హృతిక్ రోషన్ టీజర్ పేలవంగా ఉండటంపై ఘాటుగా స్పందించారు. ఆయన చెప్పిన వివరాల్లకి వెళితే..

రామయాణం సినిమా టీజర్ రిలీజ్‌కు ఈ సినిమాపై ప్రేక్షకుల ఇంట్రెస్ట్ హై రేంజ్‌లో ఉంది. ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత అంచనాలు పాతాళానికి పడిపోయాయి. ఈ సినిమా టీజర్ ముందు ఆదిపురుష్ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వందపాళ్లు నయం అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో దాడికి పాల్పడ్డారు. టీజర్ చూస్తే టెక్నికల్‌గా నీచంగా, పేలవంగా, అత్యంత దారుణంగా ఉంది. వీడియో గేమ్ కంటే దారుణంగా ఉంది అంటూ కామెంట్స్ గుప్పిస్తున్నారు.
ఈ క్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ఘాటుగా పోస్ట్ పెట్టారు. రామయణం సినిమా టీజర్ చూసిన తర్వాత వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చాలా బ్యాడ్‌గా ఉందనిపించింది. దానిని చూడటానికి బాధగా ఉంది. ఆ సినిమాలో భాగమైన కారణంగా ఇంకా బాధగా ఉంది. 11 ఏళ్ల వయసులో లండన్ ట్రిప్ సందర్భంగా ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఓ అవగాహన కలిగింది. అది నాలో పూర్తిగా మార్పు తెచ్చింది. నేను పూర్తిగా తన్మయత్వం చెందాను. ప్రస్తుతం ఆడియెన్స్, నెటిజన్స్ వస్తున్న ట్రోలింగ్‌ను దృష్టిలో పెట్టుకొని లోపాలను సరిదిద్దేందుకు పూనుకోవాలి. ఆడియెన్స్, నెటిజన్స్ కూడా కొంత సంయమనం పాటించాలి. ఫైనల్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత స్పందించాలి అని ఆయన అన్నారు.
భారతీయ పురాణాల్లో ఎపిక్‌గా భావించే రామాయణాన్ని ఆధారంగా చేసుకొన్ని టెక్నికల్ హంగులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నమిత్ మల్హోత్రా తన సొంత బ్యానర్ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, యష్ తన బ్యానర్ మైండ్ క్రియేషన్స్, ఛార్లెస్ రోవెన్స్ కు చెందిన అమెరికన్ స్టూడియో అట్లాస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం అంచనా సుమారుగా 2600 కోట్ల నుంచి 4000 కోట్ల రూపాయల మేర ఉంటుంది అని అంచనా వేశారు. ఈ చిత్రం హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నారు.


Click it and Unblock the Notifications











