WAR 2: ఎన్టీఆర్‌కు హృతిక్ స్వీట్ రిప్లై.. దేవరపై గ్లింప్స్‌పై బాలీవుడ్ స్టార్ రివ్యూ
బడా బ్యాగ్రౌండ్ ఉన్నా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్‌తో బాలీవుడ్‌లో తనదైన శైలిని ఏర్పరచుకుని స్టార్ హీరోగా సత్తా చాటుతోన్నాడు హృతిక్ రోషన్. ఆ మధ్య వరుస హిట్‌లతో పరిశ్రమను షేక్ చేసిన ఈ హ్యాండ్సమ్ హీరో.. కొద్ది సంవత్సరాలుగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్‌ను సొంతం చేసుకోవాలని 'ఫైటర్' చేస్తున్నాడు.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ జనవరి 10వ తేదీన తన 50వ పుట్టినరోజును జరుపుకున్నాడు. దీన్ని పురస్కరించుకుని అతడికి ఎంతో మంది అభిమానులు, సినీ సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఉన్న అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా హృతిక్ రోషన్‌కు బర్త్‌డే విషెస్ తెలిపారు.

పాన్ ఇండియా స్టార్ హృతిక్ రోషన్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ మేరకు తన X (ట్విట్టర్) ఖాతాలో 'హ్యాపీ బర్త్‌డే హృతిక్ సార్. మీకు అద్భుతమైన, పాజిటివ్ అంశాలతో కూడిన ఏడాది రావాలని కోరుకుంటున్నాను. ఫైటర్ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను' అంటూ పోస్ట్ చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌పై బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తాజాగా స్పందించాడు. ఈ మేరకు తన X (ట్విట్టర్) ఖాతాలో 'థ్యాంక్యూ సో మచ్ తారక్. దేవర మూవీ నుంచి వచ్చి గ్లింప్స్ నాకు బాగా నచ్చింది. గుడ్ లక్.. త్వరలోనే కలుసుకుందాం' అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ పోస్టును ఎన్టీఆర్ అభిమానులు ట్విట్టర్‌లో రీ ట్వీట్ చేస్తూ తమ సంతోషాన్ని తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా.. బాలీవుడ్‌లో రూపొందుతోన్న 'వార్ 2' సినిమాలో ఎన్టీఆర్.. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీని 'బ్రహ్మాస్త్ర' ఫేం అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న ఈ చిత్రం కోసం రూ. 300 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్లు కూడా తెలిసింది.
జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'వార్ 2' మూవీని 'బ్రహ్మాస్త్ర' ఫేం అయాన్ ముఖర్జీ తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అంతేకాదు, ఓ టెస్ట్ షూట్‌ను కూడా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నారు. ఆ వెంటనే ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా కొద్ది రోజుల పాటు జరుపుకున్నారు.


Click it and Unblock the Notifications











