twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హృతిక్ కాదు.. నన్నే చూసుకున్నట్లు ఉంది: ‘సూపర్ 30’ ట్రైలర్‌పై ఆనంద్ కుమార్

    |

    హృతిక్ రోషన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సూపర్ 30' మూవీ ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు వికాస్ బెహల్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడని స్పష్టమవుతోంది. ఇందులో హృతిక్ టీచర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మాథమేటీషియన్ ఆనందర్ కుమార్ జీవితం ఆధారంగా ఈ మూవీ రూపొందించారు.

    పట్నాకు చెందిన మ్యాథమెటీషియన్‌ ఆనంద్‌ కుమార్‌ ఏటా ఆర్థికంగా వెనుకబడిన 30 మంది విద్యార్థులకు ఐఐటీ పరీక్ష కోసం శిక్షణ ఇస్తుంటారు. దీని వల్ల పేదరికంలో ఉన్న ప్రతిభగల విద్యార్థుల జీవితాలు ఎలా మారిపోయాయి అనే పాయింటును ఫోకస్ చేస్తూ కథ సాగుతుంది.

    Hrithik Roshans Super 30 trailer released

    ఈ ట్రైలర్ ఆనంద్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. తనను తాను తెరపై చూసుకున్నట్లు ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ట్రైలర్ కట్ చేసిన తీరు, దేశ విదేశాల్లో ప్రపంచ ప్రఖ్యాత సంస్థల అధిపతులుగా ఇండియన్స్ ఉన్న విషయం వెల్లడించడం ట్రైలర్లో హైలెట్ అయింది.

    హృతిక్ రోషన్ అనగానే మనకు కండలు తిరిగిన శరీరం, సూపర్ మ్యాన్ లాంటి కటౌట్ గుర్తుకు వస్తుంది. అయితే ఇందులో ఆయన పూర్తి భిన్నమైన లుక్‌తో కనిపించబోతున్నారు. ఈచిత్రంలో ఆయన తన గత సినిమాలకు భిన్నంగా డీగ్లామరస్ లుక్‌లో కనిపించబోతున్నారు.

    నడియావాలా గ్రాండ్‌సన్ ఎంటర్టెన్మెంట్స్, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, ఫాంటమ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'సూపర్ 30'లో మృనాల్ ఠాకూర్, పంకజ్ త్రపాఠి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జులై 12న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Hrithik Roshan's Super 30, directed by Vikas Bahl trailer released. Produced by Nadiadwala Grandson Entertainment, Reliance Entertainment and (the now-defunct) Phantom Films, Super 30 also stars Mrunal Thakur and Pankaj Tripathi in key roles. The film will hit the theatres on July 12.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X