భార్యతో విడాకులు.. ప్రియురాలితో సరసాలు.. స్టార్ హీరో పోస్ట్ వైరల్
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు,పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్. ఏ సెలబ్రెటీ ఎప్పుడూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో? ఏ స్టార్ కపుల్ ఎలా విడిపోతారో? చెప్పడం కష్టం. ఇటీవల ఓ బాలీవుడ్ స్టార్ హీరో తన భార్యకు విడాకులిచ్చి.. తన ప్రియురాలితో చెట్టపట్టాలు వేసుకుంటూ తిరుగుతున్నాడు. తాజాగా తన ప్రియురాలు పుట్టినరోజు నాడు స్పెషల్ విషెస్ చెప్పి అందరి కంటబడ్డారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఇంతకీ అతని ప్రియురాలు ఎవరో ఓ లూక్కేయండి.
ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan). ఈ గ్రీకు వీరుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో నటించి, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే.. ఇటీవల హృతిక్ రోషన్ సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితంతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. 2000లో ఇంటీరియర్ డిజైనర్ సుస్సానే ఖాన్‌ని పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలున్నారు. అయితే.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2014లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. విడాకుల సమయంలో హృతిక్ రోషన్ తన మాజీ భార్యకు దాదాపు 400 కోట్ల భరణం ఇచ్చినట్టు టాక్ . విడాకుల తర్వాత వీరద్దరూ తన ఫ్రెండ్స్ ని కొనసాగిస్తున్నరని టాక్.

ఇక విడాకుల తరువాత హృతిక్ బాలీవుడ్ సింగర్ సబా ఆజాద్‌తో డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి బాలీవుడ్ ఈవెంట్స్, పార్టీలలో కలిసి పాల్గొన్నారు. హృతిక్ హీరోగా నటించిన సినిమాలకి సబా ఆజాద్ పని చేసింది. ఈ సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడిందనీ, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని టాక్. అలాగే.. సబాతో ప్రేమ కారణంగానే హృతిక్ రోషన్ తన భార్య సుసాన్నె ఖాన్‌కి విడాకులు ఇచ్చాడనే ప్రచారం ఉంది. ఇది ఎలా ఉన్నా.. హృతిక్ రోషన్ మాత్రం తన ప్రియురాలు సబా ఆజాద్‌తో కలసి చెట్టాపట్టాలేసుకుని తిరుగున్నాడు. ఈ జంటకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇదెలా ఉంటే.. తాజాగా హీరో హృతిక్ రోషన్ తన ప్రియురాలు సబా ఆజాద్(Saba Azad)కి ఇన్‌స్టాగ్రామ్ లో బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలను షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే సభా అంటూ రాసుకొస్తూ.. లవ్ సింబల్ ఎమోజీని అందులో యాడ్ చేశారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. తమ ఫ్యాన్స్ కూడా కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ జంట డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో త్వరలోనే మ్యారేజ్ చేసుకుంటారంటూ బీటౌన్‌లో టాక్ వినిపించింది.
ఇక హృతిక్ రోషన్ సినిమాల విషయానికొస్తే. ప్రస్తుతం వార్ 2 మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు. అది కూడా నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో. దీంతో ఈ సినిమాపై అటు బాలీవుడ్ లో.. ఇటు టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఏ మూవీ షూటింగ్ ముంబై పరిసర ప్రాంతాలలో జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ షూటింగ్లో పాల్గొన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











