దిశా పటానితో డేటింగ్ చేయాలని.. ఇంత అసభ్యంగానా, మండిపడ్డ హృతిక్ రోషన్!
Recommended Video

సూపర్ హీరో హృతిక్ రోషన్ తరచుగా వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు. కంగనా రనౌత్ తో మొదలైన వివాదం హృతిక్ ని గత ఏడాది వరకు వెంటాడింది. హృతిక్ వ్యక్తిగత జీవితంలో కూడా చిక్కులు వచ్చాయి. చేదు జ్ఞాపకాలు మరచి ఇప్పుడిప్పుడే తన భార్యకు చేరువవుతూ పిల్లలతో సంతోషంగా గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో మరో వివాదం హృతిక్ మెడకు చిక్కుకుంది. వివాదం పెద్దది చేయడానికి ప్రయత్నిస్తున్న వారి ప్రయత్నాల్ని హృతిక్ తిప్పికొట్టాడు.

బలవంతంగా
కొన్నిరోజులుగా హృతిక్ కు వ్యతిరేంగా బాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. హాట్ బ్యూటీ దిశా పటానిని డేటింగ్ కోసం హృతి రోషన్ బలవంత పెట్టినట్లు వార్తలు వచ్చాయి. సినిమా అవకాశం రావాలంటే నాతో డేటింగ్ చేయాలని హృతిక్ దిశాని బలవంత పెట్టినట్లు ఆ వార్తల సారాంశం.

మనస్తాపంతో
దీనికి కొనసాగింపుగా బాలీవుడ్ మీడియా సంస్థలు కొన్ని సంచలన రూమర్స్ సృష్టించింది. హృతిక్ ప్రవర్తనతో దిశా పటాని మస్తాపానికి గురై అతడితో నటిస్తున్న చిత్రం నుంచి తప్పుకుంది అని ప్రచారం జరిగింది.

కంగనా వివాదం
కంగనా రనౌత్ ప్రేమలేఖల వివాదం మరచిపోక ముందే హృతిక్ మరోమారు చిక్కుల్లో చిక్కుకున్నాడని అంతా భావించారు. దిశా పటాని స్పందించిన ఈ వార్తాల్ని ఖండించడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది.

హృతిక్ సార్
నా గురించి, హృతిక్ సార్ గురించి జరుగుతున్న ప్రచారం అసత్యం. ఆయన అందరితో చాలా మర్యాదగా ఉంటారు. ఇలాంటి నిరాధారమైన వార్తలు సృష్టించకండి అంటూ దిశా పటాని క్లారిటీ ఇచ్చింది. హృతిక్ సార్ లాంటి మంచి మనిషిపై చెడు ప్రచారం జరుగుతుంటే స్పందించాల్సిన భాద్యత నాకు ఉంది అని తెలిపింది.

బుద్ది చెబుతూ
తన గురించి, దిశా పటాని గురించి వస్తున్న కథనాలపై హృతిక్ రోషన్ స్పందించాడు. తప్పుడు వార్తలు రాసిన మీడియా సంస్థలకు బుద్ది చెబుతూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. మీకు పాపులారిటీ కావాలంటే నన్ను అడగండి.. ఏదైనా చేసిపెడతాను.. కానీ ఇంత అసభ్యంగా అవాస్తవాలు మాత్రం రాయకండి అని చురకలు అంటించాడు.


Click it and Unblock the Notifications











