అమెరికాలో మారుమోగుతున్న హృతిక్ రోషన్ పేరు.. బాలీవుడ్ స్టార్ ఏం చేశాడంటే?
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతగానో పరిచయం. ఆయన సినిమాల ద్వారా దక్షిణాది ఆడియన్స్ను కూడా కట్టిపడేశారు. ఇక్కడ ప్రేక్షకులను ఆయన అభిమానులుగా మార్చుకున్నారు. హృతిక్ రోషన్ నటించిన క్రిష్, ధూమ్ 2 చిత్రాలు సౌత్ లోనూ బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. చిత్రాల్లో హృతిక్ రోషన్ ఫిట్నెస్, నట విశ్వరూపం, స్టైలిష్ లుక్ ఇలా అన్ని విషయాల్లో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అందించారు. హాలీవుడ్ హీరో మాదిరి కనిపించి ఆశ్చర్యపరిచారు. అప్పటినుంచి హృతిక్ రోషన్ సినిమాలకు దక్షిణాదిలోను అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు.
ఇక హృతిక్ రోషన్ తాజాగా వార్తల్లో నిలిచారు. ఆయన ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారో తెలిసిందే. ఆయన వయసు 30 లో ఏకంగా చూడగానే తన హ్యాండ్సమ్ లుక్ తో ఎవరినైనా ఆకట్టుకునేవారు. అయితే ఇప్పటికీ కూడా హృతిక్ రోషన్ అలాగే కనిపిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ గా పేరు దక్కించుకున్న హృతిక్ రోషన్ బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లోనూ క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఆయన చిత్రాలతో ఇండియాలోనే కాకుండా వరల్డ్ లోను అభిమానులను సాధించుకున్నారు.

అందం విషయంలో హృతిక్ రోషన్ వరల్డ్ లోనే టాప్ 10 హ్యాండ్సమ్ లు క్ హీరోల జాబితాలో పేరు దక్కించుకున్నారు. ఇక ఇండియన్ హీరోల్లో హ్యాండ్సమ్ హల్క్ అంటే హృతిక్ రోషన్ పేరే ముందుగా వినిపిస్తుంది. అందంతోపాటు హృతిక్ రోషన్ తన ఫిట్నెస్ విషయంలో కూడా ఆశ్చర్యపరుస్తుంటారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ వయసు 50 ఏళ్లు అయినప్పటికీ సిక్స్ ప్యాక్ బాడీ మెయింటైన్ చేస్తూ మెంటల్ ఎక్కిస్తున్నారు. ఈ వయసులోనూ యాక్షన్ సినిమాల్లో స్టంట్ లు పడుతూ అదరగొడుతున్నారు.
బాలీవుడ్ లో పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్ ఉన్న ఏకైక హీరో హృతిక్ రోషన్. వి షేప్ బాడీతో హృతిక్ రోషన్ వెండితెరపై ఎన్నో స్టంట్ లు కొట్టి ప్రేక్షకులను అలరించారు. నెక్స్ట్ హృతిక్ రోషన్ వార్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను ప్రమోట్ చేసే కార్యక్రమంలో భాగంగా హృతిక్ రోషన్ ఇటీవల పలు ఈవెంట్లకు హాజరవుతున్నారు. తన స్టైలిష్ లుక్ తో ఆకట్టుకుంటున్నారు. రీసెంట్ లుక్ ఒకటి నెట్ వైరల్ గా మారింది. దాంతో హృతిక్ రోషన్ రివర్స్ ఏజింగ్ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు.
అమెరికాలో హృతిక్ రోషన్ లేటెస్ట్ లుక్ విపరీతంగా వైరల్ అవుతుంది. అమెరికాకు చెందిన ద లిజ్ వేరియంట్ ఎక్స్ అకౌంట్ ద్వారా హృతిక్ రోషన్ ఫోటోను షేర్ చేసింది. 50 ఏళ్లలో నూ 30 ఏళ్ల వయస్కుడిగా కనిపిస్తున్న రుతిక్ రోషన్ ఫోటోను మరో అమెరికన్ 50 ఏళ్ల వయసున్న ఫోటోను కంపేర్ చేస్తూ పోస్ట్ చేసింది. దీంతో హృతిక్ రోషన్ ఎవరు అంటూ అమెరికన్లు తెగ వెతికేస్తున్నారు. గూగుల్లో సెర్చ్ చేసి హృతిక్ రోషన్ ఫోటోలను చూస్తున్నారు. ఆయన గురించి మరింతగా తెలుసుకుంటున్నారు. ఇలా హృతిక్ రోషన్ పేరు అమెరికాలో మారు మోగుతుంది. హృతిక్ రోషన్ వార్ 2 షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకున్నారని తెలుస్తుంది. త్వరలో దర్శకత్వం బాధ్యతలు చేపట్టి క్రిష్ 4ను స్వయంగా డైరెక్ట్ చేయబోతున్నారు. నోరా ఫతేహిని హీరోయిన్గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మునుముందు అప్డేట్స్ అందనున్నాయి.


Click it and Unblock the Notifications











