వీడియో: కేంద్ర మంత్రి ఛాలెంజ్‌కు హృతిక్ రోషన్ సై!
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఫిట్ నెస్ విషయంలో బాగా కేర్ తీసుకుంటాడు, అందుకే ఇప్పటికి హృతిక్ హ్యాండ్సమ్ గా, ఫిట్ గా కనిపిస్తాడు. కేంద్ర మంత్రి, మాజీ ఒలంపిక పతక విజేత అయిన రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ సెలెబ్రెటీలకు ఓ ఛాలెంజ్ విసిరారు. ఐస్ బకెట్ ఛాలెంజ్ తరహాలో ఇది కూడా ఒకటి. భారతీయులంతా ఫిట్ గా ఉండాలనే ఉద్దేశంతో రాజ్యవర్ధన్ సింగ్ ఈ సవాల్ విసిరారు.

ప్రధాని మోడీ ఫిట్ నెస్ చూసి స్ఫూర్తి పొందిన తాను ఈ సవాల్ విసురుతున్నాని అన్నారు. తానుఫిట్ గా ఉండేందుకు రోజు పుషప్స్ చేస్తానని, దానికి సంబందించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హృతిక్ రోషన్, విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులకు ఛాలెంజ్ విసిరారు. వారు ఈ ఛాలెంజ్ స్వీకరిస్తే వారిని చూసి మరికొంత మంది స్ఫూర్తి పొందుతారని అన్నారు.
తనలాగే మీరు ఫిట్ నెస్ కోసం ఏంచేస్తారో వీడియో రూపంలో తెలియజేయాలని కోరారు. ఈ ఛాలెంజ్ ని వెంటనే స్వీకరించిన హృతిక్ రోషన్.. తాను ఫిట్ నెస్ కోసం రోజు సైక్లింగ్ చేస్తానని ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.


Click it and Unblock the Notifications











