Don't Miss!
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్‌తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
హృతిక్ వర్సెస్ టైగర్.. యాక్షన్‌తో దుమ్ముదులిపేశారు
'సూపర్ 30'తో చాలా రోజుల తర్వాత మంచి విజయాన్ని అందుకున్నాడు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రదర్శితమవుతోంది. ఇందులో హృతిక్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే, కలెక్షన్ల పరంగానూ 'సూపర్ 30' దూసుకుపోతోంది. సినిమా విడుదలైన మొదటి వారాంతాంలోనే రూ. 50 కోట్ల మార్కును అందుకుంది. ఈ విజయంతో చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది. బీహార్‌కు చెందిన ఆనంద్ కుమార్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
'సూపర్ 30' సెట్స్‌పై ఉండగానే హృతిక్ మరో చిత్రంలో నటించాడు. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించిన ఈ సినిమా పేరు 'వార్'. పూర్తి యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను సిద్దార్ద్ ఆనంద్ డైరెక్ట్ చేశారు. యస్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాలో వాణీ కపూర్ నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో హృతిక్, టైగర్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ను చూపించారు. వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి మరీ నటించారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఇద్దరు హీరోల మధ్య వచ్చే బైక్ చేజింగ్ సీన్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాణీ కపూర్ బికినీతో కనిపిస్తుంది. దీని తర్వాత రన్నింగ్ చేజ్, హెలీకాఫ్టర్ సీన్స్, కార్ చేజ్ సీన్లతో పాటు బీచ్‌లో డ్యాన్స్ తదితర సన్నివేశాలు చూపించారు. మొత్తంగా ఈ టీజర్ హృతిక్ వర్సెస్ టైగర్‌లా పవర్ ప్యాక్డ్గా సాగింది.
ఈ టీజర్ విడుదలైన కొద్ది సమయంలోనే భారీ వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మల్టీస్టారర్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అటు హృతిక్ అభిమానులు, అటు టైగర్ ఫ్యాన్స్ దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ టీజర్ చూస్తుంటే సినిమా హిట్ అవడం ఖాయమన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.