twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హృతిక్ వర్సెస్ టైగర్.. యాక్షన్‌తో దుమ్ముదులిపేశారు

    |

    'సూపర్ 30'తో చాలా రోజుల తర్వాత మంచి విజయాన్ని అందుకున్నాడు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో ప్రదర్శితమవుతోంది. ఇందులో హృతిక్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అలాగే, కలెక్షన్ల పరంగానూ 'సూపర్ 30' దూసుకుపోతోంది. సినిమా విడుదలైన మొదటి వారాంతాంలోనే రూ. 50 కోట్ల మార్కును అందుకుంది. ఈ విజయంతో చిత్ర యూనిట్ సంతోషంగా ఉంది. బీహార్‌కు చెందిన ఆనంద్ కుమార్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.

    'సూపర్ 30' సెట్స్‌పై ఉండగానే హృతిక్ మరో చిత్రంలో నటించాడు. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించిన ఈ సినిమా పేరు 'వార్'. పూర్తి యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను సిద్దార్ద్ ఆనంద్ డైరెక్ట్ చేశారు. యస్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాలో వాణీ కపూర్ నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

    Hrithik Roshan, Tiger Shroff War movie Teaser Released

    తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో హృతిక్, టైగర్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ను చూపించారు. వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి మరీ నటించారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఇద్దరు హీరోల మధ్య వచ్చే బైక్ చేజింగ్ సీన్‌తో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాణీ కపూర్ బికినీతో కనిపిస్తుంది. దీని తర్వాత రన్నింగ్ చేజ్, హెలీకాఫ్టర్ సీన్స్, కార్ చేజ్ సీన్లతో పాటు బీచ్‌లో డ్యాన్స్ తదితర సన్నివేశాలు చూపించారు. మొత్తంగా ఈ టీజర్ హృతిక్ వర్సెస్ టైగర్‌లా పవర్ ప్యాక్‌డ్‌గా సాగింది.

    ఈ టీజర్ విడుదలైన కొద్ది సమయంలోనే భారీ వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మల్టీస్టారర్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అటు హృతిక్ అభిమానులు, అటు టైగర్ ఫ్యాన్స్ దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ టీజర్ చూస్తుంటే సినిమా హిట్ అవడం ఖాయమన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.

    English summary
    Bollywood Handsome Hero Hrithik Roshan, Tiger Shroff's Multi Starrer Movie War. This Movie Will Released on October 2nd. Directed by Siddharth Anand, the film is set to be the action film of the year.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X