Just In
- 1 min ago
ఊరికే లింకులు పెడతారు కదా! అందుకే చేశా.. ఓపెన్‌గా చెప్పేసిన సుడిగాలి సుధీర్
- 10 hrs ago
పవన్ కల్యాణ్‌తో సమంత అక్కినేని.. ఆ సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది అందుకేనా?
- 11 hrs ago
ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డ శ్రియ.. లండన్‌లో పోలీసుల తూటా తప్పించుకొని!
- 11 hrs ago
రామ్ చరణ్‌కు ప్రతిష్టాత్మక అవార్డ్.. ఆ ఫ్యాన్‌కు అంకితమిచ్చి గొప్ప మనసు చాటుకున్నాడు
Don't Miss!
- Finance
బద్ధకం ఖరీదు... రూ 42,69,00,000
- News
ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్: 40 శాతం బకాయిలు విడుదల: విలీనంపైన నేడు కీలక నిర్ణయం..!
- Lifestyle
బుధవారం మీ రాశిఫలాలు 11-12-2019
- Sports
బీసీసీఐ లేకుండా టీమిండియా మూడేళ్లు క్రికెట్ ఆడింది.. గంగూలీ ఎంపికతో ఆశ్యర్యపోయా: రవిశాస్త్రి
- Automobiles
మీ అభిమాన హీరో మోటార్ సైకిల్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది
- Technology
యూఎస్‌లో స్టార్టయిన న్యూ మాక్ ప్రో ఆర్డర్స్
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
హిందీ సినిమాకు తెలుగులో ఈ రేంజ్ రెస్పాన్స్ ఎప్పుడూ చూసుండరు.. రికార్డులు బద్దలు
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ - యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 'వార్'. పూర్తి యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను సిద్దార్ద్ ఆనంద్ డైరెక్ట్ చేశారు. యస్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాలో వాణీ కపూర్ నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగుతో పాటు మరికొన్ని చిత్రాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో హృతిక్, టైగర్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ను చూపించారు. వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి మరీ నటించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఇద్దరు హీరోల మధ్య వచ్చే కార్ ఛేజింగులు, భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయని తెలుస్తోంది. వీటితో పాటు హీరోయిన్ వాణీ కపూర్ బికినీ సీన్స్ బాగుంటాయని అంటున్నారు. దీని తర్వాత రన్నింగ్ చేజ్, హెలీకాఫ్టర్ సీన్స్, కార్ చేజ్ సీన్లతో పాటు బీచ్‌లో డ్యాన్స్ తదితర సన్నివేశాలు చూపించారు. మొత్తంగా ఈ ట్రైలర్ హృతిక్ వర్సెస్ టైగర్‌లా పవర్ ప్యాక్డ్గా సాగింది.

ఈ ట్రైలర్ విడుదలైన కొద్ది సమయంలోనే భారీ వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఒక హిందీ సినిమా అయి ఉండి తెలుగులో ఒకే రోజు 2.6 మిలియన్ వ్యూస్ సాధించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మల్టీస్టారర్ సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. అటు హృతిక్ అభిమానులు, అటు టైగర్ ఫ్యాన్స్ దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా హిట్ అవడం ఖాయమన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.