చిరంజీవి సైరాపై హృతిక్ రోషన్ వార్... ఏం జరుగబోతోందో?

Recommended Video

It's Chiranjeevi Vs Hrithik Roshan At Box Office || Syeraa || Hrithik Roshan || Tiger Shroff

'కాబిల్' తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఇక వరుస సినిమాలతో అభిమానులను ఎంటర్టెన్ చేయబోతున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'సూపర్ 30' లాస్ట్ వీక్ విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మూడు రోజుల్లో రూ. 50 కోట్ల వసూలు చేసింది.

త్వరలో హృతిక్ 'వార్' అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో తొలిసారిగా హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. ఇందులోని యాక్షన్ సీన్లు సినిమాపై అంచనాలు పెరిగేలా చేశాయి. అయితే ఈ టీజర్ మెగా క్యాంపులో గుబులు రేపినట్లుగా చర్చించుకుంటున్నారు.

‘సైరా' మూవీకి ‘వార్'కు సంబంధం ఏమిటి?

‘సైరా' మూవీకి ‘వార్'కు సంబంధం ఏమిటి?

హిందీలో రాబోతున్న హృతిక్-టైగర్ ‘వార్' చిత్రానికి... మెగాస్టార్ ‘సైరా' మూవీకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా?... ‘సైరా' రిలీజ్ అయ్యే అక్టోబర్ 2వ తేదీనే ‘వార్' చిత్రం కూడా విడుదలవుతుండటమే ఇందుకు కారణం. ‘సైరా’ తరహాలోనే ‘వార్’ చిత్రం కూడా హిందీ, తమిళం, తెలుగులో విడుదలకాబోతోంది.

‘సైరా'ను హిందీలో భారీగా ప్లాన్ చేశారు

‘సైరా'ను హిందీలో భారీగా ప్లాన్ చేశారు

‘సైరా' చిత్రాన్ని తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇందులో అమితాబ్ బచ్చన్‌తో కీలక పాత్ర చేయించడానికి కారణం కూడా అదే. ‘వార్' కూడా అదే రోజు వస్తే ‘సైరా' ఓపెనింగ్స్ మీద ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు.

రెండు సినిమాల మధ్య పోటీ తప్పదు

రెండు సినిమాల మధ్య పోటీ తప్పదు

‘సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని హిందీలో పర్హాన్ అక్తర్‌కు చెందిన సంస్థ భారీ ధరకు దక్కించుకుంది. ఈ చిత్రాన్ని వీలైనన్ని ఎక్కువ థియేటర్లలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ‘వార్' మూవీని కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు చిత్రాల మధ్య పోటీ తప్పదు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సైరా నరసింహా రెడ్డి

సైరా నరసింహా రెడ్డి

సైరా నరసింహారెడ్డి చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, తమన్నా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X