మెగాస్టార్ సినిమా రీమేక్‌లో హృతిక్.. బాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్
బాలీవుడ్‌లో తనదైన శైలిని ఏర్పరచుకుని స్టార్ హీరోగా ఎదిగాడు హృతిక్ రోషన్. ఆ మధ్య వరుస హిట్‌లతో పరిశ్రమను షేక్ చేసిన ఈ హ్యాండ్సమ్ హీరో.. కొద్ది సంవత్సరాలుగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయినా ఇవేమీ ఆయనను హిట్ ట్రాక్ ఎక్కించలేకపోయాయి. దీంతో సరికొత్తగా ఆలోచించి, కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు.

మెగాస్టార్ రీమేక్‌లో..
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ - హేమ మాలిని కాంబినేషన్‌లో 1982లో వచ్చిన చిత్రం ‘సత్తే పే సత్తా'. ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నాడట హృతిక్. ప్రస్తుతం ఆయన నటించిన ‘సూపర్ 30' విడుదలైన తర్వాత ఆ సినిమా పట్టాలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఫర్హా ఖాన్ తెరకెక్కిస్తారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి దీనికి నిర్మాతగా వ్యవహరిస్తారని, దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.

‘సూపర్ 30'తో సరికొత్తగా..
ప్రస్తుతం హృతిక్ రోషన్ ‘సూపర్ 30' అనే సినిమా చేశాడు. ఈ చిత్రం రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హృతిక్ గణిత శాస్త్రవేత్తగా నటించాడు. బీహార్‌కు చెందిన ఆనంద్ కుమార్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం. సాధారణ జీవినం గడుపుతున్న ముప్పై మందిని ఈ శాస్త్రవేత్త ఎలా ప్రయోజకులను చేశాడన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

డీ గ్లామర్ రోలే అయినా..
బాలీవుడ్ మొత్తంలోనే హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న హృతిక్.. ‘సూపర్ 30'లో మాత్రం డీ గ్లామర్ రోల్ చేశాడు. గణిత శాస్త్రవేత్త ఎలా అయితే ఉంటాడో.. అచ్చం అదే గెటప్‌తో హృతిక్ కనిపించాడు. సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతున్న ఈ అందగాడు.. తొలిసారి బయోపిక్ మూవీలో నటించాడు. మరి ఈ సినిమా అయినా అతడిని గట్టెక్కింస్తుందో లేదో చూడాలి.

‘సూపర్ 30' గురించి..
భారతదేశంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిన గణిత శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దీన్ని వికాశ్ డైరెక్ట్ చేయగా, మూడు బడా సంస్థలు నిర్మించాయి. ఇందులో హృతిక్‌తో పాటు మృనాల్ ఠాకూర్, వీరేంద్ర సక్సేనా, పంకజ్ త్రిపాఠి తదితరులు నటించారు. ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











