Aryan Khanకి ఓపెన్ లెటర్ రాసిన హృతిక్.. అందరూ నాకు తెలుసు, నువ్వు తెలుసుకో అంటూ!

ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసులో షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఎన్‌సిబికి అక్టోబర్ 7 వరకు అంటే ఈరోజు వరకు కస్టడీ ఉంది. ఆర్యన్ కస్టడీ నేటితో ముగియనున్న నేపథ్యంలో ఈ రోజు కోర్టులో హాజరు పరుస్తారు. ఆర్యన్ తరపు న్యాయవాది మరోసారి బెయిల్ దరఖాస్తు దాఖలు చేయనున్నారు. ఆ సంగతి అలా ఉంచితే బాలీవుడ్ ప్రముఖులు అతనికి మరియు షారుఖ్ కుటుంబానికి మద్దతునిచ్చారు. ఇప్పుడు ఈ జాబితాలో హృతిక్ రోషన్ పేరు కూడా చేరారు. హృతిక్ రోషన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో స్టార్ కిడ్ ఆర్యన్ ఖాన్ కోసం బహిరంగ లేఖ రాశారు. ఆ వివరాల్లోకి వెళితే

బాలీవుడ్ అండగా

బాలీవుడ్ అండగా

ముంబై క్రూయిజ్ పార్టీలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఆర్యన్ ప్రస్తుతం ఎన్‌సిబి కస్టడీలో ఉన్నాడు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో క్రూయిజ్ షిప్‌పై దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత పలువురు బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. తాజాగా ఆర్యన్ ఖాన్ ను ఉద్దేశిస్తూ హృతిక్ రోషన్ సుదీర్ఘ లేఖ రాశారు.

ఆర్యన్ కి లేఖ

ఆర్యన్ కి లేఖ

'నా ప్రియమైన ఆర్యన్, జీవితం ఒక వింత ప్రయాణం, జీవితం చాలా బాగుంటుంది ఎందుకంటే జీవితం మార్చదగినది, జీవితం చాలా బాగుంటుంది ఎందుకంటే మనకు రకరకాల అనుభవాలు లభిస్తాయి అని అన్నారు. కానీ దేవుడు దయగలవాడు. అతను బలమైన వాళ్లకు మాత్రమే ఆడటానికి టఫ్ బాల్స్ ఇస్తాడు అంటూ తన ప్రేమ మరియు మద్దతును హృతిక్ రోషన్ వ్యక్తం చేశారు.

వాటిని నశింపచేస్తాయి

వాటిని నశింపచేస్తాయి

'అలా టఫ్ బాల్స్ తో ఆడేందుకు ఎంపికయ్యారని మీకు తెలుసు, మీరు ఇప్పుడు అనుభూతి చెందుతున్నారని నాకు తెలుసు. కోపం, గందరగోళం, నిస్సహాయత ... ఇవన్నీ మీ నుండి హీరోని బయటకు తీసుకురావడానికి అవసరమైనవి. అయితే జాగ్రత్తగా ఉండండి, అదే విషయాలు దయ, కరుణ, ప్రేమ వంటి మంచి విషయాలను కాల్చేస్తాయి. ' అని హృతిక్ పేర్కొన్నారు.

నీకు నువ్వు తెలుసుకో.

నీకు నువ్వు తెలుసుకో.

మిమ్మల్ని మీరు కాల్చుకుని షైన్ అవడానికి అనుమతించండి, పొరపాట్లు, వైఫల్యాలు, విజయాలు, లాంటి వాటిలో మీతో వేటిని ఉంచాలో మరియు వేటిని అనుభవానికి దూరంగా విసిరేయాలో తెలిస్తే అవన్నీ ఒకటే. కానీ వారందరితో మీరు బాగా ఎదగగలరని తెలుసుకోండి. నేను నిన్ను చిన్నప్పుడే తెలుసుకున్నాను, నువ్వు ఒక మనిషిగా ఎలా ఉంటావో నాకు తెలుసు, ఇప్పుడు నీకు నువ్వు తెలుసుకో.

ప్రతి దాన్ని సొంతం చేసుకో

ప్రతి దాన్ని సొంతం చేసుకో

అనుభవించే ప్రతి దాన్ని సొంతం చేసుకో, అవి నీ బహుమతులు. నన్ను నమ్ము చివరికి నువ్వు డాట్స్ కనెక్ట్ చేసినప్పుడు ... నేను మీకు హామీ ఇస్తున్నాను, ఇది అర్థవంతంగా ఉంటుంది. అని రాసుకొచ్చారు. ఇక అంతకు ముందు అక్టోబర్ 4 న, ఎన్‌సిబి కోర్టుకు ఆర్యన్ కోడ్‌వర్డ్‌లో చాట్ చేసేవాడని దానిని డీకోడ్ చేయడానికి అతని కస్టడీ అవసరమని కోర్టుకు ఎన్సీబీ కోరింది.

అతనికి డీలర్లతో కనెక్షన్లు ఉన్నాయని అనేక చాట్‌లు సూచిస్తున్నాయి. డ్రగ్స్ పెడ్లర్‌తో మాట్లాడడానికి ఆర్యన్ ఖాన్ అండ్ కో కోడ్‌వర్డ్‌ను ఉపయోగించారు. అటువంటి పరిస్థితిలో, నిందితుడిని రిమాండ్‌లో ముందు కూర్చోబెట్టి విచారించాల్సిన అవసరం ఉందని ఎన్సీబీ కోరే అవకాశం ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X