ప్రాణాపాయ స్థితిలో హృతిక్ రోషన్ ప్రియురాలు... హెల్త్ కండీషన్‌పై నటి భావోద్వేగం

బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టైల్‌కు, అందానికి కేరాఫ్ అడ్రస్. గ్రీకు వీరుడి లాంటి ఫీచర్స్‌తో అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలుగొందుతున్నారు. 50 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో కుర్రాళ్లను మించిన వేగంతో సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. తొలుత సుస్సానే ఖాన్‌తో ఆయన వివాహం జరగ్గా.. ఆమెకు విడాకులు ఇచ్చిన హృతిక్ ప్రస్తుతం నటి, సింగర్ షబాతో నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. అయితే ఈ షబా ప్రస్తుతం అనారోగ్యం బారినపడ్డారు. దాదాపు రెండు వారాలుగా ఆసుపత్రి బెడ్‌పై చికిత్స తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

2000లో కహోనా ప్యార్ హై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు హృతిక్ రోషన్. ఆ తర్వాత ఫిజా, కబి ఖుషి కబీ గమ్, కోయ్ మిల్ గయా, క్రిష్ సిరీస్, లక్ష్య, ధూమ్ 2, జోదా అక్బర్, గుజారిష్, అగ్నిపథ్, సూపర్ 30, బాంగ్ బ్యాంగ్, వార్, ఫైటర్, జస్ట్ డ్యాన్స్ సినిమాలతో హిందీ పరిశ్రమలో తిరుగులేని నటుడిగా నిలిచారు. నటి, ఫ్యాషన్ డిజైనర్ సుస్సానే ఖాన్‌తో ప్రేమలో పడ్డ హృతిక్ రోషన్.. ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే అనివార్య కారణాలతో ఈ జంట తమ 14 ఏళ్ల బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టి విడాకులు తీసుకున్నారు.

Hrithik Roshan s Girlfriend Saba Azad Hospitalized Due to Cyclospora Infection Shares Health Warning

సుస్సానే ఖాన్‌తో విడాకుల తర్వాత మెక్సికన్ నటి బార్బరా మోరీతో, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌లతో హృతిక్ డేటింగ్ చేశారు. ప్రస్తుతం సబా ఆజాద్‌తో ఆయన ప్రేమాయణం సాగిస్తున్నారు. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ క్రమంలో సబా ఆజాద్ షాకిచ్చారు. తీవ్ర అనారోగ్యంతో ఆమె ఆసుపత్రి పాలయ్యారు. హాస్పిటల్ బెడ్‌పై ఉన్న తన ఫోటోతో, తనకు ఏం జరిగిందో తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు సబా ఆజాద్.

అత్యంత ప్రమాదకరమైన సైక్లోస్పోరా కయెటానెన్సిస్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకడంతో తాను ఆసుపత్రి పాలైనట్లు సబా పేర్కొన్నారు. ఈ సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశిస్తే.. జీర్ణ వ్యవస్థ పనితీరు అస్తవ్యస్తం అవుతుంది. గడిచిన 14 రోజులుగా నా జీవితంలో అత్యంత దారుణంగా గడిచాయి. ఎల్లప్పుడూ ఇంటి ఆహారాన్నే తీసుకుంటూ.. బయటకు వెళ్లినప్పుడు సొంత వాటర్ బాటిల్‌నే తీసుకెళ్తా. అలాంటిది నాకు ఈ ఇన్ఫెక్షన్ ఎలా సోకిందో అర్ధం చేసుకోవడం లేదు. అత్యంత బిజీగా ఉండే సమయంలో అనారోగ్యం నన్ను దెబ్బ తీసింది అని సబా ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు వారాల్లోనే 4 కిలోల బరువు తగ్గిపోయాను. రోజులో రెండు సార్లు వర్కవుట్స్ చేస్తాను, అలాంటిది టూత్ పిక్ ఎత్తేంత ఓపిక కూడా లేదు. కనీసం నడవలేకపోతున్నాను. నేను చెప్పేది ఒకటి.. మీ ఆరోగ్యం కోసం కూరగాయలు, ఆకుకూరలను శుభ్రంగా కడిగిన తర్వాతే వండుకోండి. మీ ప్రాణం కొన్నిసార్లు ఈ శుభ్రత మీదే ఆధారపడి ఉంటుంది. కూరగాయలను నీటితోనే కాకుండా బేకింగ్ సోడాతో శుభ్రం చేయండి. పచ్చిగా తినే ఆహారం ద్వారానే ఇలాంటి ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఈ కష్ట సమయంలో హృతిక్ నాకు కొండంత అండగా నిలిచాడు. నన్ను నవ్విస్తూ, మూడ్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ సబా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. హృతిక్ అభిమానులు, సినీ ప్రముఖులు ఆమె కోలుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు.

More from Filmibeat

Read more about: hrithik roshan saba azad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X