సిద్ధమైన శ్రీదేవి రెండో కూతురు.. మొదటి సినిమా కోసం భారీ ఆఫర్స్.. దిమ్మతిరిగే రెమ్యునరేషన్స్!

అతిలోక సుందరి శ్రీదేవి తన కూతుళ్ల ఇష్ట ప్రకారమే ఒక ట్రాక్ సెట్ చేస్తున్న సమయంలో అనుకోకుండా కన్ను మూసింది. ఆమె మరణాంతరం శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ అనుకున్నట్టుగానే బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు చిన్న కుమార్తె ఖుషి కపూర్ కూడా బాలీవుడ్ లో సాలీడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ బ్యూటీకి వస్తున్న ఆఫర్స్ పై బాలీవుడ్ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి.

జాన్వీ సక్సెస్..

జాన్వీ సక్సెస్..

శ్రీదేవి పెద్ద కుమార్తె.. జాన్వీ కపూర్ ధడక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో వచ్చిన ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికి హీరోయిన్ గా జాన్వీ మంచి మార్కులే కొట్టేసింది. అందుకే మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఓ విదంగా అమ్మడు నటిగా సక్సెస్ అయ్యిందనే చెప్పాలి.

ఖుషి కపూర్ ఎంట్రీ..

ఖుషి కపూర్ ఎంట్రీ..

ఇక ఇప్పుడు అందరి చూపు ఖుషి కపూర్ వైపే మళ్లింది. ఈ బ్యూటీ ఎంట్రీ కోసం ఓ వర్గం ఆడియెన్స్ చాలానే ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ బ్యూటీ ఈ మధ్య తన అందంలో చాలా మార్పులే తెచ్చింది. శ్రీదేవి లాంటి హైట్, అందంతో పాటు యాక్టింగ్ లో కూడా బాగానే రాటు దేలిందట. దీంతో ఖుషి కపూర్ ఎంట్రీపై బాలీవుడ్ మీడియా స్పెషల్ ఫోకస్ పెట్టింది.

చెల్లి కూడా అతనితోనే..

చెల్లి కూడా అతనితోనే..

కరణ్ జోహార్ శ్రీదేవి కూతుళ్లకు గాడ్ ఫాదర్ లా మారిపోయాడు. ఆయన సలహాలతోనే ఇద్దరు ఒకే రకమైన అడుగులు వేస్తున్నారు. ఇక ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా ఖుషి కపూర్ కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే తన మొదటి సినిమా చేయనుందట. జాన్వీ కపూర్ మొదటి సినిమాతో సక్సెస్ అందుకోకపోయినా కూడా ఇప్పుడు మంచి మంచి ఆఫర్స్ అందుకుంటుంది అంటే..అది కరణ్ జోహార్ ప్లానే. ఇక ఖుషి కూడా అదే తరహాలో ఆలోచిస్తోంది.

Recommended Video

Shraddha Kapoor Thinking About Telugu Offers After Saaho Result
భారీ ఆఫర్స్..

భారీ ఆఫర్స్..

ఖుషి కపూర్ వెండితెరపై ఎంట్రీకి సిద్ధమైంది అనగానే కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే మొదటి సినిమా చేస్తుందని అందరికి తెలుసు. అయినప్పటికీ కొన్ని బడా ప్రొడక్షన్ సంస్థలు అమ్మడికి భారీ ఆఫర్స్ ఇచ్చాయట. కోటి రూపాయల రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినప్పటికీ ఒప్పుకోలేదట. జాన్వీ కపూర్ కి కరణ్ జోహార్ మొదటి సినిమాకు 50లక్షలు మాత్రమే ఇచ్చాడని టాక్. ఇక ఇప్పుడు ఖుషి కపూర్ కి కూడా అంతే ఇవ్వనున్నాడట. మరి ఖుషి కపూర్ మొదటి సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X