ఓటీటీలో భారీ ధరకు డీల్ సెట్ చేసుకున్న యువ హీరో.. ఓల్డ్ మూవీ రీమేక్
సినిమా ఇండస్ట్రీ కరోనా లాక్ డౌన్ కారణంగా ఎలాంటి నష్టాలను ఎదుర్కొంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా థియేటర్స్ ఆరు నెలల నుంచి మూత పడటంతో ఎన్నో సినిమాలు విడుదలకు నోచుకోవడం లేదు. ఒక్కసారిగా కోలుకోలేని దెబ్బ పడింది. అయితే సినిమాలను ఆలస్యంగా రిలీజ్ చేస్తే మొదటికే మోసం వస్తుందని షూటింగ్స్ పూర్తి చేసుకున్న సినిమాలను ఓటీటీ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక మొత్తానికి లక్ష్మీ బాంబ్ సినిమా నుంచి ఓటీటీలో బాలీవుడ్ సినిమాలకు మంచి ఆఫర్స్ దక్కుతున్నాయి. ఇక మరో సినిమాకి కూడా అదిరిపోయే డీల్ సెట్టయ్యింది. ప్రఖ్యాత స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వరుణ్ ధావన్ నటించిన కూలి నెంబర్ 1 సినిమా యొక్క డిజిటల్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి ఈ చిత్రాన్ని ప్రీమియర్ చేయనున్నట్లు టాక్.

ఇక అమెజాన్ ప్రైమ్ మేనేజ్‌మెంట్ రూ.70 కోట్లతో
కూలీ నెం: 1 హక్కులను పొందినట్లు తెలుస్తోంది. రాబోయే మరికొన్ని వారాల్లో సినిమా యూనిట్ మిగిలిన షూటింగ్‌ను ముగించబోతోంది. అక్టోబర్ చివరి నాటికి మొదటి కాపీతో సిద్ధంగా ఉండాలని ప్లాన్ చేసుకున్నారట. డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గోవింద యొక్క 1995 చిత్రం కూలీ నెంబర్ వన్ సినిమాకు ఒరిజినల్ రీమేక్. వరుణ్ ధావన్ ఓల్డ్ సినిమాల రీమేక్స్ తోనే కమర్షియల్ హిట్స్ ఎక్కువగా అందుకుంటున్నాడు. ఇదివరకే జుడ్వా (హలో బ్రదర్) సినిమాను రీమేక్ చేసి తన మార్కెట్ ని 200కోట్లకు పెంచుకున్నాడు. మరి ఈ సారి ఏ స్థాయిలో హిట్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











