గాయకుడు మిఖాసింగ్ ఇంట్లో భారీ చోరి.. హంతకుడి కోసం వేట!
బాలీవుడ్ గాయకుడు మిఖా సింగ్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.4 లక్షల విలువైన నగదు, ఆభరణాలు దొంగిలించబడినాయి. తన ఇంట్లో జరిగిన దొంగతనంపై మిఖాసింగ్ తరుఫున అతడి మేనేజర్ ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. మిఖాసింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
నా ఇంట్లో రూ.3 లక్షల విలువైన అభరణాలు, రూ.1 లక్ష విలువైన నగదు చోరీకి గురైంది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య జరిగి ఉండవచ్చు. సీసీ ఫుటేజీ పరిశీలించగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ చోరి వెనుక మిఖా పని మనిషి అంకిత్ వాసన్ హస్తం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మిఖా సింగ్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును ఐపీసీ సెక్షన్ 381 ప్రకారం అంకిత్‌పై కేసు నమోదు చేశాం. అతడి ఆచూకీ కోసం వెతుకుతున్నాం అని సంబంధింత పోలీసు అధికారి వెల్లడించారు.


Click it and Unblock the Notifications











