Huma Qureshi: సగం చీరలో కాలా బ్యూటీ బోల్డ్ షో.. పైన కూడా సగమే.. ఎటు చూసినా అందమే!
సినిమా ప్రపంచంలో కొంతమంది బ్యూటీలు హీరోయిన్స్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ కొన్ని సపోర్టింగ్ రోల్స్ తో మాత్రం మంచి క్రేజ్ అందుకుంటూ ఉంటారు. అయితే సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు వచ్చిన రాకపోయినా కూడా కొంతమంది సపోర్టింగ్ రోల్స్ చేసేవారు కూడా బాహ్య ప్రపంచంలో గ్లామర్ తో హీటెక్కిస్తున్నారు. ఇక కాలా సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ అందుకున్న 36 ఏళ్ల నటి కూడా ఊహించిన విధంగా గ్లామర్ షో తో ఆశ్చర్యపరుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

గ్లామర్ షోతో క్రేజ్
హుమా ఖురేషి.. సోషల్ మీడియాలో బిజీగా తిరిగే నెటిజన్లకు ఈ బ్యూటీ పేరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంటర్నెట్ ప్రపంచం హవా కొనసాగుతున్నప్పటి నుంచి కూడా అమ్మడు తన గ్లామర్ షోతో ప్రతిసారి ఏదో ఒక విధంగా షాక్ ఇస్తూనే ఉంది. ఇక వయసుకు తగ్గ పాత్రలు చేస్తూనే బయట ప్రపంచంలో మాత్రం కుర్ర హీరోయిన్స్ కు దీటుగా గ్లామర్ షో తో కూడా దర్శనమిస్తుంది.

అలాంటి గుర్తింపు
2012లో గ్యాంగ్స్ ఆఫ్ వస్సేయ్ పూర్ సిరీస్ లతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హుమా ఖురేషి ఆ తర్వాత మంచి క్రేజ్ అందుకుంది. కేవలం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయకుండా డిఫరెంట్ కంటెంట్ ఉండే సినిమాలను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. హుమా ఖురేషి ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది అంటే తప్పకుండా అందులో ఏదో ఒక బలమైన క్యారెక్టర్ ఉండి ఉంటుంది అని అనేలా ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది.

బాలీవుడ్ లో హిట్ సినిమాలు
బాలీవుడ్లో ఆమె ప్రతి ఏడాది ఏదో ఒక సినిమాతో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఇక ఆమె కెరీర్ లో మర్చిపోలేని సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. బదలాపూర్, హైవే, వైట్, జాలి ఎల్.ఎల్.బి 2 సినిమాలలో నటనకు ఆమెకు ప్రశంసలు దక్కాయి. అలాగే కొన్ని సినిమాలలో అనే స్పెషల్ గెస్ట్ పాత్రల్లో కూడా కనిపించింది.

రజనీకాంత్ సినిమాలో..
కేవలం బాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తే ఆమె ఏమాత్రం వెనుకడుగు వేయకుండా నటిస్తోంది. ఇక మొదటగా ఆమె సౌత్ ఇండస్ట్రీలో అయితే రజనీకాంత్ కాలా సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్దనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ అందులో ఆమె చేసిన ఒక రోల్ కు మంచి గుర్తింపు లభించింది.

సగం చీరలో ఊహించని విధంగా..
ఇక హుమా ఖురేషి నటన విషయాన్ని పక్కన పెడితే గ్లామర్ లో మాత్రం తనకు పోటీని ఇచ్చే వారు లేరు అనే విధంగా కనిపిస్తూ ఉంటుంది. రీసెంట్గా ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొనగా అందులో ఒక డిఫరెంట్ స్టైల్ చీరలో కనిపించింది. టాప్ టు బాటమ్ అన్ని సగం సగం వేసుకున్నట్లుగా ఉంది అని ఫాలోవర్స్ కొంటెగా కామెంట్ చేస్తున్నప్పటికీ ఈ చీరలో మాత్రం ఆమె చాలా అందంగా ఉంది అని స్పందిస్తున్నారు.

క్లివెజ్ షో..లెగ్స్ అందాలు
ఒకవైపు క్లివెజ్ షో అలాగే మరొకవైపు లెగ్స్ అందాలతో హుమా ఖురేషి మతి పోగొట్టేస్తోంది అని నెటిజన్లు సోషల్ మీడియాలో పాజిటివ్ గానే కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా బిజీ అవుతుంది. అలాగే పాన్ ఇండియా తరహాలో వెబ్ సిరీస్ లు కూడా చేయాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఒక బాలీవుడ్ సినిమాతో పాటు మరో మరాఠీ సినిమా కూడా చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











