ఎన్నడూ తప్పుగా ప్రవర్తించలేదు.. మీటూ ఆరోపణలపై హ్యూమా ఖురేషి క్లారిటీ

బాలీవుడ్‌లో ఓ వైపు సుశాంత్ కేసు, డ్రగ్స్ భూతం, రియా చక్రవర్తి అరెస్ట్‌లు, కంగాన కామెంట్లు దద్దరిల్లిపోతోంది. ఇక పాయల్ ఘోష్ చేసిన మీటూ ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ తనపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని, రూంకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడని సన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇక కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాయల్ వ్యాఖ్యలపై భిన్న రకాలుగా స్పందనలు వచ్చాయి.

తాను ఎవ్వరినీ ఏమీ చేయలేదని, ఇన్ని రోజులు ఆలోచించావా అది చెప్పడానికి? బాగా ఆలోచించి కథను బాగా అల్లావని అనురాగ్ కశ్యప్ సెటైర్ వేశాడు. ఇక తన తరుపున లాయర్ నోటీసులు కూడా జారీ చేశాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పాయల్ ఘోష్.. హ్యూమా ఖురేషి, మహీ గిల్ పేర్లను వాడింది. హ్యూమా ఖురేషి, మహి గిల్ వంటి వారు తాను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తారని, పడుకుంటారని అనురాగ్ అన్నట్టు పాయల్ పేర్కొంది.

Huma Qureshi Over Me Too ALlegations About Anurag Kashyap

ఇలా తన పేరు రావడంపై హ్యూమా ఖురేషి స్పందించి.. అనురాగ్ మంచి వాడని సర్టిఫికేట్ ఇచ్చింది. తనతో ఎన్నడూ కూడా అసభ్యంగా ప్రవర్తించలేదని క్లారిటీ ఇచ్చింది. ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం, వార్తలు రాయడంపై ఫైర్ అయింది. వీటిని తాను చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపింది. తననే కాదు కష్టపడి ఎదిగిన మహిళలను ఇలా కించపరిచి దిగజార్చకండని అందరినీ వేడకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X