For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డైరెక్టర్‌తో రజనీకాంత్ హీరోయిన్ డేటింగ్ వ్యవహారం బట్టబయలు... ఇలా దొరికిపోయారు..

|

బాలీవుడ్‌లో టాలెంటెడ్ బ్యూటీ హ్యుమా ఖురేషి ప్రేమలో పడింది. గత కొద్దికాలంగా తమపై వస్తున్న వార్తలకు చెక్ చెబుతూ తాను డైరెక్టర్‌తో డేటింగ్ చేస్తున్నానని ఒప్పుకొన్నది. తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో ఎమోషనల్ పోస్టు పెట్టి.. ఫోటోలను షేర్ చేసింది. గ్యాంగ్ ఆఫ్ వాసేపూర్‌తో సినీ రంగ ప్రవేశం చేసిన హ్యుమా బద్లాపూర్, హైవే, జాలీ ఎల్ఎల్‌బీ 2, కాలా లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా తన డేటింగ్‌పై పోస్టు చేసిన ఎమోషనల్ కంటెంట్ ఏమిటంటే..

హ్యుమా ఎమోషనల్ పోస్టు

హ్యుమా ఎమోషనల్ పోస్టు

ఏడాది కాలంగా బాలీవుడ్ దర్శకుడు ముదస్సర్ అజిజ్‌తో డేటింగ్ చేస్తున్నది. తాజాగా తనతో ఉన్నఅనుబంధాన్ని వ్యక్త చేస్తూ.. ఎదురవుతున్న ప్రతికూలతను అధిగమించడం నీ మానసిక ధృడత్వాన్ని తెలియజేస్తుంది. నీ కలలన్నీ సాకారం కావాలని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే బాబా ముదస్సర్. ఏడు సముద్రాల అవతలి నుంచి ప్రేమతో ఈ సందేశాన్ని పంపుతున్నాు. ఎప్పుడూ చిరునవ్వును చెదరనివ్వకు అంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

ప్రియురాలికి భావోద్వేగంతో సమాధానం

ప్రియురాలికి భావోద్వేగంతో సమాధానం

హ్యుమా ఖురేషి పోస్టుకు ముదస్సర్ సమాధానమిస్తూ.. బాధల్లో, కష్టాల్లో ఉండే నాలాంటి వాళ్లకు నీ ప్రశంస చాలా ఊరటను ఇస్తుంది. అలాంటి ఊరటను పొందడాన్ని లక్కీగా భావిస్తున్నాను. నీ ప్రశంసకు, నీ సపోర్ట్‌కు థ్యాంక్స్ చెబితే చిన్నమాట. ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రేమను పంచే అద్భుతమైన వ్యక్తివి నీవు అంటూ ముదస్సర్ ఓ పోస్టు పెట్టారు.

డైరెక్టర్ కూడా అంతే క్రేజీగా

డైరెక్టర్ కూడా అంతే క్రేజీగా

గతంలో హ్యూమా బర్త్ డే సందర్భంగా ముదస్సర్ కూడా ఇలాంటి ఎమోషనల్ పోస్టు చేశారు. మంచి మనుసున్న మహరాణివి నీవు. అలాంటి నీకు నా జన్మదిన శుభాకాంక్షలు, నీ జీవితంలో సుఖ: సంతోషాలతో ఉండాలని కోరుకొంటున్నాను. ప్రపంచంలోని ప్రేమంతా నీకే దక్కాలని కోరుకొంటున్నాను. అమెరికాలో నీ బర్త్ డే ఘనంగా జరుపుకోవాలని కోరుకొంటున్నాను అని ముదస్సర్ తన పోస్టులో తెలిపారు.

ముదస్సర్ కెరీర్ గురించి

ముదస్సర్ కెరీర్ గురించి

1978లో ప్రముఖ దర్శకుడు బీఆర్ చోప్రా దర్శకత్వలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన క్లాసికల్ మూవీ పతి, పత్ని ఔర్ ఓ అనే సినిమాను ముదస్సర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే, భూమి పడ్నెకర్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల లక్నోలో ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకొన్నది.

English summary
Bollywood actor Huma Qureshi writes emotiona letter to director Mudassar Aziz who dating for a year. She wrote, "The Many Moods of Mudassar... It sure has been a hell of a ride ... I’m so proud of everything you do and the man you are ! I pray from the bottom of my heart that all your dreams come true ... Happy Birthday baba mudassar_as_is Sending love from saat samundar paar.... Stay smiling always ... Onwards #love #happybirthday #joy #virgobaby #Septemberchild Love you more than you know ...(sic)."
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more