నా లివర్ 75 శాతం పాడైపోయింది: షాకింగ్ విషయం బయటపెట్టిన అమితాబ్
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్యానికి సంబంధించి షాకింగ్ విషయం బయటపెట్టారు. తనకు క్షయవాధి సోకిన 8 ఏళ్ల వరకు ఆ విషయమే తెలియదని, చాలా ఆలస్యంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా బయటపడిందని తెలిపారు.
స్వస్థ్ ఇండియా అనే కార్యక్రమంలో పాల్గొన్న అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ... తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా కొన్ని రకాల వ్యాధులను ముందే గుర్తించి సులభంగా చికిత్స చేయించుకోవడానికి వీలుగా ఉంటుందన్నారు.

గతంలో నాకు క్షయ(టిబి), హెపటైటిస్ బి వ్యాధులు ఉండేది. క్షయ సోకిందనే విషయం 8 ఏళ్ల వరకు తెలియలేదు. రెగ్యులర్‍గా మెడికల్ చెకప్ చేయించుకోకపోవడమే ఇందుకు కారణం. దీంతో నా 25 శాతం లివర్(కాలేయం) చెడిపోయింది. ప్రస్తుతం నేను కేవలం 25 శాతం కాలేయంతో సర్వైవ్ అవుతున్నాను... అని అమితాబ్ బచ్చన్ తెలిపారు.
ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరంగా చాలా నష్టపోయారు. అందుకే ఆయన ఇలాంటి వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేస్తున్నారు. పోలియో, హైపటైటిస్-బీ, క్షయ, డయాబెటిస్ వంటి వ్యాధులపై ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











