కంగనాకు కూడా డ్రగ్స్ అలవాటుందట.. !!
బాలీవుడ్ పరిశ్రమలో మహారాష్ట్ర వర్సెస్ కంగనా రనౌత్ విషయం హాట్ టాపిక్ గా మారింది. మహా సర్కార్ అధికార పార్టీ నేతలు... కంగన మహారాష్ట్రలో అడుగు పెట్టవద్దంటూ కామెంట్లు చేసిన నేపథ్యంలో ఈ విషయం సంచలనంగా మారింది. శివసేన నేతలకు దీటుగా కంగన సైతం కామెంట్లు చేసింది. ఈ క్రమంలో గతంలో కంగనాపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు మహా ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఈ మేరకు ఇప్పటికే ముంబై పోలీసులను దర్యాప్తు చేయమని కోరినట్లు తెలుస్తోంది. కంగనాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఆరోపణలు చేయగా..
దీనిపై కంగనా స్పందిస్తూ 'తాను డ్రగ్స్ తీసుకున్నట్టు నిరూపించాలని.. డ్రగ్స్ టెస్ట్ కు తాను సిద్ధంగా ఉన్నానని.. తనకు డ్రగ్ మాఫియాతో లింకులు ఉన్నాయని రుజువైతే ముంబైలో ఎప్పుడూ అడుగుపెట్టనని' ట్వీట్ చేశారు.

అయితే కంగనా రనౌత్ గతంలో 'తానూ డ్రగ్ అడిక్ట్ నే' అని చెప్పిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 6 నెలల క్రితం 'నవరాత్రి 5వ రోజు' అంటూ ఇంస్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది కంగనా. 16 ఏళ్ళ వయస్సులో ఇంటి నుంచి పారిపోయి వచ్చి ఫిల్మ్ స్టార్ ని అయ్యానన..అప్పుడే మత్తు మందులకు అలవాటు పడ్డానని కంగనా తెలిపింది. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాను ని ఈ వీడియోలో తెలిపింది కంగనా. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











