twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సెక్స్ చూపించడం సంతోషంగా ఉంది’... లేడీ ప్రొడ్యూసర్ దూకుడు!

    |

    బాలీవుడ్ లేడీ నిర్మాత ఏక్తా కపూర్ తను తీసే సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తరచూ విమర్శల పాలవుతున్న సంగతి తెలిసిందే. ఆమె నిర్మించే వాటిలో సెక్స్, శృంగార ప్రేరేపితంగా ఉండే కంటెంటుతో పాటు ప్రేక్షకులను మూఢ నమ్మకాల వైపు నడిపించే 'నాగిని' లాంటి సీరియల్స్ ఉండటమే ఇందుకు కారణం.

    ఇలాంటి వాటిని రూపొందిస్తున్న తనపై వచ్చే ఆరోపణలను ఏక్తా కపూర్ తనదైన శైలిలో తిప్పి కొడుతున్నారు. సమస్య తను తీసే సినిమాల్లో, సీరియల్స్‌లో లేదని, సమస్య అంతా మన దేశంలో, కొందరి ఆలోచనల్లో ఉంది అంటూ దూకుడుగా సమాధానం ఇస్తోంది.

    సెక్స్ చూపించడం సంతోషంగా ఉంది

    సెక్స్ చూపించడం సంతోషంగా ఉంది

    తన ప్రొడక్షన్లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లాంటి వాటిలో సెక్స్ కంటెంట్ చూపించడం సంతోషంగా ఉంది. మనకు సెక్స్ అనే అంశంతో ఎలాంటి సమస్య లేదని నా అభిప్రాయం... సమస్య అంతా మన దేశంలోనే ఉందని ఏక్తా కపూర్ చెప్పుకొచ్చారు.

     ఈ దేశంలో డబుల్ స్టాండర్డ్స్

    ఈ దేశంలో డబుల్ స్టాండర్డ్స్

    ఒకరికోరకంగా, ఇంకొకరికింకో రకంగా నియమాలను వర్తింపచేసే ఒక ధోరణి మన దేశంలో ఉంది. సెక్స్ అనే విషయంలో సరైన అవగాహన లేక పోవడం, దాని గురించి ఓపెన్‌గా మాట్లాడుకోక పోవడం పెద్ద సమస్య. మనకు అసలు సమస్య ఇలాంటి సినిమాలు,సీరియల్స్ వల్ల కాదు... సెక్సువల్ క్రైమ్స్ వల్ల పెద్ద సమస్య అని ఏక్తా కపూర్ తెలిపారు.

    మూఢనమ్మకాల్లాంటి సీరియల్ష్ తీయడంపై

    మూఢనమ్మకాల్లాంటి సీరియల్ష్ తీయడంపై

    ప్రజల్లో మూఢ నమ్మకాలను మరింత బలపరిచే నాగిని లాంటి సీరియల్స్ తీస్తున్నరనే వాటిపై స్పందిస్తూ.... ‘నన్ను అడిగితే నాగిని చాలా గోప్ప షో... గొప్ప ఫాంటసీ అని చెబుతాను. నాకు హారీ పొట్టర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాంటివి చాలా ఇష్టం. అయితే మనం ఎఫెక్ట్స్ పరంగా వాటితో పోల్చుకోకూడదు. మన బడ్జెట్ వాటిలో ఒక శాతం కూడా ఉండదు. అయితే కథ పరంగా మనం పోటీ పడవచ్చు.

    విమర్శలు పట్టించుకుంటే ముందుకు వెళ్లలేం

    విమర్శలు పట్టించుకుంటే ముందుకు వెళ్లలేం

    మనం తీసే అన్ని సినిమాలు, సీరియల్స్ అందరికీ నచ్చాలని ఏమీ లేదు. కొందరికి కొన్ని నచ్చుతాయి. కొన్ని నచ్చవు. విమర్శలు అనేవి ఏక్కడైనా ఉంటాయి. వాటిని పట్టించుకుంటూ పోతే ముందుకు వెళ్లలేం అని ఏక్తా కపూర్ తెలిపారు.

    English summary
    “I am very happy showing sex. I don’t think we should have any problem with sex. The problem with our country. We are a country of double standards. We should have a problem with non-consensual sex; we should have a problem with sexual crimes,” Ekta Kapoor said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X