twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇన్ని హిట్లు కొట్టినా ఒక్క అవార్డు రాలేదు, అక్కర్లేదంటూ స్టేట్మెంట్!

    |

    బాలీవుడ్ ఇండస్ట్రీని గత మూడు దశాబ్దాలుగా ఏలుతున్న స్టార్లలో సల్మాన్ ఖాన్ ఒకరు. 1988లో 'బీవీ హో తో ఐసి' ద్వారా తెరంగ్రేటం చేసిన సల్మాన్ ఖాన్ ఇంతింతై, వటుడింతై అన్నట్లు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్ హీరోగా ఎదిగారు. అయితే సల్మాన్ ఖాన్ జర్నీ అంత సాఫీగా ఏం సాగలేదు. 30 ఏళ్ల ఆయన సినిమా ప్రయాణం రోలర్ కోస్టర్ జర్నీ అని చెప్పక తప్పదు.

    ఇప్పటి వరకు తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న సల్మాన్ ఒక్క జాతీయ అవార్డు కూడా దక్కించుకోలేకపోయాడు. ఈ విషయమై ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు జాతీయ అవార్డు కానీ, ఇతర అవార్డులు కానీ అవసరం లేదు. నాకు రివార్డ్స్ వస్తేచాలు అన్నారు.

     I do not want National Awards, I want rewards: Salman Khan

    ప్రేక్షకులు నా సినిమా థియేటర్లకు వెళ్లి చూడటమే నాకు జాతీయ అవార్డుతో సమానం. దేశం మొత్తం నా సినిమా చూస్తుంది అనే విషయం కంటే పెద్ద రివార్డు ఏమీ ఉండదు అని సల్మాన్ ఖాన్ స్పష్టం చేశారు.

    'భారత్' చిత్రంలో నటనకు గాను కత్రినా కైఫ్ జాతీయ అవార్డు దక్కించుకునే అవకాశం ఉందని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఇప్పటి వరకు ఆమె కెరీర్లో చేయని భిన్నమైన పాత్రలో కనిపించబోతోందని, అందరికీ నచ్చుతుందని తెలిపారు.

    అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్న 'భారత్' ఈద్ సందర్భంగా జూన్ 5న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొరియన్ మూవీ 'ఆన్ ఓడె టు మై ఫాదర్' చిత్రానికి ఇది రీమేక్. ఇందులో సల్లూ భాయ్ ఐదు డిఫరెంట్ లుక్స్‌లో ప్రేక్షకులకు వినోదం పంచబోతున్నారు.

    English summary
    "I don't want a National Award or any other award. I just want rewards. I get my National Award when people go to the theatres to watch my films. There's no reward bigger than the entire nation watching my film." Salman Khan said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X