»   » సెక్స్, ఎక్స్‌ఫోజింగ్ వల్ల సినిమాలు ఆడవు... మా ఇంట్లో ఆ సీన్ వల్ల ఇబ్బంది పడ్డాం!

సెక్స్, ఎక్స్‌ఫోజింగ్ వల్ల సినిమాలు ఆడవు... మా ఇంట్లో ఆ సీన్ వల్ల ఇబ్బంది పడ్డాం!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సినిమాలన్నాక ఇంటిమేట్ సీన్లు, శృంగార సన్నివేశాలు సర్వసాధారణం. అయితే బాలీవుడ్లో టాప్ స్టార్‌గా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ సినిమాల్లో మాత్రం అలాంటివి కనిపించవు. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఉండే సినిమాలు మాత్రమే చేస్తానని సల్మాన్ తనకు తానుగా ఓ రూల్ పెట్టుకున్నాడు. చివరకు షారుక్ ఖాన్ సైతం 2012లో వచ్చిన 'జబ్ తక్ హై జాన్' సినిమాతో తన 'నో కిస్సింగ్' రూల్ బ్రేక్ చేసి కత్రినాతో ముద్దు సీన్లో పాల్గొన్నప్పటికీ.... సల్మాన్ ఖాన్ మాత్రం ఇప్పటి వరకు తాను అనుకున్న విలువలకు కట్టుబడి సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయమై సల్మాన్ వివరణ ఇచ్చారు.

  ఎందుకు మీరు ఆ సీన్లు చేయరు?

  ఎందుకు మీరు ఆ సీన్లు చేయరు?

  మీ సినిమాల్లో శృంగార సన్నివేశాలు ఎందుకు ఉండవు? ఇంటిమేట్ సీన్లు చేయడం అంటే మీకు భయమా? అనే ప్రశ్నకు సల్మాన్ రియాక్ట్ అవుతూ.... ఓసారి తమ గెలాక్సీ అపార్టుమెంటులో జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు.

  ఆ సీన్ రాగానే అంతా ఇబ్బంది పడ్డాం

  ఆ సీన్ రాగానే అంతా ఇబ్బంది పడ్డాం

  ఓసారి మా ఇంట్లో కుటుంబ సభ్యులమంతా కలిసి ఇంగ్లిష్ సినిమా చూస్తున్నాం. అందులో హీరో హీరోయిన్ కిస్ చేసుకునే సన్నివేశం వచ్చింది. అందరూ ఆ సీన్ చూడటానికి ఇబ్బంది పడుతూ తమ తలలు తిప్పుకున్నారు. ఆ సీన్ పూర్తవ్వగానే అంతా మళ్లీ సినిమా చూడటం ప్రారంభించారు. అప్పటి నుండి నా సినిమాల్లో అలాంటి సీన్లు ఉండకూడదని నిర్ణయించుకున్నాను అన్నారు సల్మాన్ ఖాన్.

  హిట్టవ్వాలని ఇలాంటి నీచమైన గిమ్మిక్స్ అవసరం లేదు

  హిట్టవ్వాలని ఇలాంటి నీచమైన గిమ్మిక్స్ అవసరం లేదు

  బాక్సాఫీసు వద్ద సినిమా వర్కౌట్ అవ్వడానికి ఇలాంటి నీచమైన గిమ్మిక్స్ అవసరం లేదు అని నా ఉద్దేశ్యం. అందుకే నా సినిమాల్లో అలాంటివి ఉండవు. అయితే ఇలాంటి వర్కౌట్ అవ్వవు అని నేను అనడం లేదు. అవసరం లేదు అని మాత్రమే చెబుతున్నాను అని సల్మాన్ స్పష్టం చేశారు.

  సెక్స్, స్కిన్ షో వల్ల సినిమాలు ఆడవు

  సెక్స్, స్కిన్ షో వల్ల సినిమాలు ఆడవు

  మైనే ప్యార్ కియా సినిమాలో సీన్ సల్మాన్ గుర్తు చేసుకుంటూ... అందులో భాగ్యశ్రీ కాలుకు బామ్ రాసే సీన్లో నేను కళ్లు మూసుకున్నాను. కేవలం సెక్స్, స్కిన్ షో ఉంటేనే సినిమాలు ఆడతాయని నేను నమ్మను, అందుకే నా సినిమాల్లో అలాంటివి ఉండవు అని సల్మాన్ ఖాన్ అన్నారు.

  English summary
  "I don’t think sex or skin can sell a film. That’s not my way of making movies." Salman Khan said. Salman recalled an incident which took place in his family home, Galaxy Apartments in Mumbai when his entire family was watching an English film. In a scene, when the co-stars kissed, the Khan-daan turned their heads so as to avoid seeing the scene and it was an awkward situation for everyone watching the film.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more