గంజాయి లీగలైజ్ చేయాలి... అది మన సంస్కృతిలో భాగం: ‘ధూమ్’ స్టార్ సంచలనం

బాలీవుడ్ నటుడు ఉదయ్ చోప్రా గుర్తున్నాడా? బాలీవుడ్ యాక్షన్ సిరీస్ ధూమ్‌లో బైక్‌తో విన్యాసాలు చేస్తూ ఒకప్పుడు ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు ప్రస్తుతం సినిమాల్లో అంత యాక్టివ్‌గా లేడు. అయితే తాజాగా ఒక అంశంతో ఉదయ్ చోప్రా మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు.

మారిజునా(గంజాయి) అనే మత్తు పదార్థం గురించి అతడు చేసిన ట్వీట్ సంచలనం అయింది. ఇండియాలో మరిజునా వాడకాన్ని చట్టబద్దం చేయాలి. దీని వల్ల భారీగా ఆదాయం వస్తుంది, అంతే కాకుండా కొన్ని మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అని ఉదయ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అయింది.

ఉదయ్ చోప్రా సంచలన ట్వీట్

ఉదయ్ చోప్రా సంచలన ట్వీట్

‘మారిజునాను చట్టబద్దం చేయాలని నేను భావిస్తున్నాను. ఎందుకంటే... ఇది మన కల్చర్‌లో ఒక భాగం. దీన్ని చట్టబద్దం చేసి టాక్స్ పరిధిలోకి తెస్తే భారీగా ఆధాయం వస్తుంది. దీని వల్ల చాలా మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అంటూ ఉదయ్ చోప్రా ట్వీట్ చేశారు.

 ఓపికగా సమాధానాలు ఇచ్చిన ఉదయ్

ఓపికగా సమాధానాలు ఇచ్చిన ఉదయ్

మారిజునా గురించి ఉదయ్ చోప్రా చేసిన కామెంటుపై చాలా చర్చ జరిగింది. దీనిపై కొందరు ఉదయ్ చోప్రాకు మద్దతు కూడా తెలుపడం గమనార్హం. మరికొందరైతే దీని వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమిటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు.

 మన సంస్కృతిలో ఇదీ ఒక భాగమా? ఎలా?

మన సంస్కృతిలో ఇదీ ఒక భాగమా? ఎలా?

గంజాయి వాడకం మన సంస్కృతిలో భాగం ఎలా అవుతుంది? అనే ప్రశ్నకు ఉదయ్ చోప్రా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. హోళీ సెలబ్రేషన్స్‌లో సేవించే భాంగ్‌లో శతాబ్దాలుగా వాడుతున్నాం. ఇది మారిజునా లాంటిదే. మహాశివరాత్రి సమయంలో సాధువులు గంజాయి స్మోక్ చేస్తుంటారు అని ఉదయ్ చోప్రా వ్యాఖ్యానించారు.

కాఫీ కూడా డ్రగ్ లాంటిదే

కాఫీ కూడా డ్రగ్ లాంటిదే

కాఫీ కూడా డ్రగ్ లాంటిదే అంటూ ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు ఉదయ్ చోప్రా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X