నన్నూ సినిమాల నుంచి గెంటేశారు... అయినా వెనక్కి తగ్గలేదు - విద్యాబాలన్
పవర్ ప్యాక్ట్ పర్ఫార్మెన్స్ కు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన విద్యాబాలన్.. ప్రస్తుతం శకుంతగా దేవి బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మానవ కంప్యూటర్ గా పేరుగాంచిన గణితశాస్త్ర నిపుణురాలి పాత్రలో ఒదిగి పోయిన విద్య, ఓటీటీ ప్లాట్ఫార్మ్ లో సినిమా రిలీజ్ పై గట్టి ఆశలే పెట్టుకుంది.
ఓటీటీలో విడుదలవుతున్న తన తొలిచిత్రం ఇదే కావడంతో, ఆసక్తిగా ఎదురుచూస్తున్న విద్య, ఈ క్రమంలో బాలీవుడ్ లో తన ప్రయాణం గురించిన విషయాలు ప్రేక్షకులతో పంచుకుంది. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో వైఫల్యాలు ఎదుర్కొన్నానని, ఎన్నో సినిమాల్లో ఆఫర్లు ఇచ్చినట్లే ఇచ్చి ఆఖరి నిమిషంలో తొలగించారని స్పష్ట చేసింది. ఆ సమయంలో తాను డిప్రెషన్ కు లోనైనట్లు తెలిపింది.

అయితే, ఇలాంటి సంఘటనలు ఎన్ని ఎదురైనా.. తాను మాత్రం మనోధైర్యం కోల్పోలేదని విద్య స్పష్టం చేసింది. ఈ ప్రయాణంలో తనకు అండగా తన కుటుంబం నిలబడిందని తెలిపింది. అయితే, అందరి విషయంలోనూ అలా జరక్క పోవచ్చునని చెప్పిన విద్య, డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలని సూచించింది.
అంతేకాదు, అలాంటి వారికి సహకరించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాని తెలిపింది. సుశాంత్ సింగ్ మరణం నేపథ్యంలో విద్యాబాలన్ మాటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరోవైపు విద్య నటించిన శకుంతలా దేవి అమెజాన్ ప్రైమ్ వీడియోలో జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.


Click it and Unblock the Notifications











