పిల్లలు వద్దు, రొమాన్స్ కావాలి, ఇంకా మమ్మల్ని నీచంగా చూస్తున్నారు: మల్లికా షెరావత్
ప్రముఖనటి మల్లికా షెరావత్ భారతీయ సినిమాలకు దూరమైనా గ్లోబల్ స్టార్‌గా రాణిస్తున్నారు. సినిమాలకు సంబంధించిన షూటింగ్స్, ఈవెంట్స్‌తో బిజీగా ఉండే మల్లికా షెరావత్ తన మేనల్లుడు రాన్షెర్ లాంబా(సోదరుడు విక్రమ్ లాంబా కొడుకు) కోసం తప్పకుండా కొంత సమయం కేటాయిస్తుంటారు. ఈ సంవత్సరం తన మేనల్లుడిని ఆమె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు తీసుకువెళ్ళారు.
"నేను వాడితో ఎంతో అనుబంధం కలిగి ఉన్నాను. నాకు స్వంత బిడ్డ లేడు, కాబట్టి రాన్షర్ నా బిడ్డలాంటివాడు. నేను వాడితో ఆడుకుంటాను, సరదాగా గడుపుతాను.. నా బెస్ట్ టైమ్ స్పెండ్ చేస్తాను. వాడితో కలిసి ట్రావెల్ చేయడం అంటే కూడా నాకు చాలా ఇష్టం."అని 42 ఏళ్ల మల్లికా వ్యాఖ్యానించారు.

తనకు పిల్లలు వద్దంటున్న మల్లికా
పిల్లలు అంటే చాలా ఇష్టపడే మల్లికా..తనకు తల్లి అయ్యే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేసింది. "పిల్లల బాధ్యత తీసుకోవాలంటే నాకు భయం. సంతానం ఉంటే... నేను పిల్లల గురించి పూర్తి సమయం ఆలోచించాలి. అలా చేయడం నా వల్ల కాదు, నేను ఇపుడు ఉన్న విధంగా సంతోషంగా ఉన్నాను.'' అని మల్లికా షెరావత్ చెప్పుకొచ్చారు.

రొమాన్స్ అంటే ఇష్టం, త్వరలో మళ్లీ ప్రేమలో పడతా
కానీ కొంతకాలం ఫ్రెంచ్ వ్యాపారవేత్త సిరిల్లే ఆక్సెన్‌ఫాన్స్‌తో డేటింగ్ చేసిన మల్లికా, మళ్ళీ ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉంది. "ఇపుడు నేను ఒంటరిగా ఉన్నాను కాని ప్రేమలో ఉండాలనుకుంటున్నాను. రొమాన్స్ చాలా గ్రేట్, ఆ రిలేషన్ మనకు ఉత్తేజాన్ని ఇస్తుంది." అని మల్లిక వ్యఖ్యానించారు.

ఇంకా నీచంగా చూసేవారు ఉన్నారు
"నటీమణుకు ఇండియాలో రూల్స్ కాస్త భిన్నంగా ఉంటాయి అనేది నా ఆలోచన. సింగిల్‌గా ఉండే నటీమణులు ఇప్పుడు మాత్రమే కాదు, ఆశా పరేఖ్ సమయంలో కూడా ఉన్నారు. రేఖాజీ కూడా అలాంటి వారిలో ఒకరు. ఒంటరి నటీమణులు భారతీయ సమాజంలో సాధారణ బాలికలు ఎదుర్కొనే అన్ని జడ్జిమెంట్స్ నుంచి మినహాయింపు పొందుతారు. అయితే, నటీమణులను నీచంగా చూసేవారు ఇప్పటికీ మన సమాజంలో ఉన్నారు. కానీ నేను ఇవన్నీ పట్టించుకోను. నా జీవితాన్ని నాకు ఇష్టమైన విధంగా గడపడానికి ఇష్టపడతాను' అని మల్లికా తెలిపారు.

మల్లికా షెరావత్
మల్లికా షెరావత్ సినిమాల విషయానికొస్తే... ఆమె చివరగా జీనత్ అనే హిందీ చిత్రంలో నటించారు. ప్రస్తుతం ‘బూ సబ్‌కి ఫటేగి' అనే వెబ్ సిరీస్ చేస్తోంది. అంతకు ముందు పలు ఇంగ్లీష్, చైనీస్ చిత్రాల్లో కూడా ఆమె నటించారు.


Click it and Unblock the Notifications











